తుఫానుకి ముందర ఉండే నిశ్శబ్ధం ఇప్పుడు అన్ని పార్టీలలో, ప్రజల్లో, మీడియా లో ఎన్నికల నిశ్శబ్ధం ఏలుతుంది. చర్చించుకోవడానికి రుచికరమైన వార్త విశేషాలు లేవాయే. రెండో దశలో ఓటింగ్ శతం లో పెను మార్పుని చూసి అప్పటి వరకు విజయ కేతనం రాష్ట్ర రాజధానిలో మేమే ఎగరవేస్తాము అని టముకు వేసిన ఇప్పటివరకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు ఉన్నటు ఉండి తమ విశ్లేషణలో ఎక్కడ తప్పులు పోర్లాయో వెతుకోవడం లో ఆ ఆ పార్టీలు ఉన్నాయి. కొన్ని పార్టీలైతే అర్రర్రె మమ్ముల్ని చూసి ఈ జనం వచ్చారు మా మానిఫెస్టో చూసి వచ్చారు అని మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు మార్పు కోరి (మార్పు అంటే సాదా సీదా మార్పూ కాదు, అఖండ మైన మార్పూ కోరి) ఫలితాల వెల్లువడించక ముందరే ఇప్పటి వరకు ఏలుతున్న పార్టీలకి అర్ధ మయ్యేలా ఎన్నికల్లో ఓటు వేసి తన నిరసనని నిజాయితిగా చెప్పారు.
ప్రజారాజ్యం మామూలు మార్పూ కాదు, సామాజిక మార్పు తెస్తాము అని చెప్పి, చెప్పిన 7 నెలల్లోనే సీట్ల కేటాయింపుతోనే మార్పుని చూపించడంతో ఆంధ్ర ప్రజానికానికి నమ్మకం చేకూర్చినందుకు కానీ వినీ ఎరగని రీతిలో 1979 ఎన్నికల తరువాత మరెన్నడూ ఓటింగ్లో పాల్గొననంత శాతం(రామ రామి 70.5%) పాల్గొన్నారు. ఒక వేల మన ఆంధ్ర ప్రజానీకం నిజంగానే ఇప్పటి వరకు ఏలిన పార్టీలను చూసి ఎక్కువ శాతం ఓటేసే పరిస్థితి ఉండుంటే, 1979 నుంచి తక్కువ శాతం ఓటింగ్ అయ్యే పరిస్థితే ఉండదు. అలాగే మహా కూటమి కూడా ఏర్పడే ప్రసక్తే ఉండి ఉండేది కాదు. ప్రజల నాడి దొరకకే అటు కూటములు ఏర్పడటం ఇటు ఎన్నికల నిశ్శబ్ధం ఏర్పడడం జరుగుతుంది. 240-260 సీట్లు మాకంటే మాకు వస్తాయి అని టముకు వేసిన పార్టీలన్నీ ఇప్పుడు చతికిల పడి కిక్కురుమనకుండా కూర్చున్నాయి. దాదాపు మీడియా లన్ని ఒకే కూటమిని ఆకాశాన ఎత్తేసినప్పటికి, మిగతా పార్టీలకి వారి వారి మీడియా దండుగా ఉన్నపటికీ, మీడియాలన్ని ప్రేక్షకుల చెవ్వులో ఈ పార్టీయే విజయం సాదిస్తాదని గాలి వార్తని నిజం చెయ్యడానికీ చేసిన కృషిని ఇటు ఓటరు ఏమాత్రం ప్రలోభ పడక, చలించక తమ భవిష్యత్తు మార్పుని తెస్తారని ప్రజరజ్యాన్ని నమ్మి అప్పటివరకు మనకెందుకులే ఈ ఎన్నికలు అని ఎన్నో ఏళ్లగా పట్టించుకోని ఓటరు ఉన్నట్టు ఉండి తన ఓటు అనే అస్త్రాణి జులిపించి తన సత్తా ని చాటు కున్నరనేది ప్రతి పార్టీ వారు ఎరిగిన సత్యం.
సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాసం ఎ కోశానా లేక పోవటంతో ఆంధ్రాని ఏలిన పార్టీలకి ఒకింత గుబులు పుడుతుంధనేది ఈ రోజు ప్రతీ ఆంధ్రునికి ఎరుకనే. ఏదిఏమైనప్పటికీ మే 16 న ఎన్నికల ఫలితాల వెల్లడితో అధికార తుఫాను ఊపు అందుకుంటాది. ప్రజారాజ్యం ప్రజలిచ్చిన సొంత బలంతో అధికార పీఠము అలంకరిస్తారని ఆశిస్తూ నేను కూడా మౌన వ్రతం లో కి జోగుతా.....
Sunday, May 10, 2009
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment