Monday, March 30, 2009

మీ ఓటు జయప్రకాశ్ కా లేక చిరంజీవికా అని అలోచిస్తున్నారా?

యదావిధిగా విక్రమార్ఖుడు చెట్టు పై ఉన్నశవాన్ని దింపి బుజాన్న వేనుకుని వెల్తుండగ,విక్రమార్ఖుడు యొక్క ప్రయాసను తేలిక చెయ్యటంకోసం అంతట బేతాళుడు విక్రమార్ఖుడితో ఇలా అన్నాడు-"విక్రమార్ఖా!నీ ప్రయాస తేలిక చెయ్యటంకోసం మళ్లీ నీకు నెనోక కధ చెబుతాను.కధ విన్నాక దానికి సరైన విడుపు చెప్పాలి. విడుపు తెలిసి, నీవు చెప్పని ఎడల నీ తల వెయ్యివ్రక్కలగును".
మౌనంగా విక్రమార్ఖుడు చెప్పుఅన్నటుగా తల ఊపగ,అంతట బేతాళుడు విక్రమార్ఖుడితో కధ చెప్పనాగెను:-
"అనగనగ ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు త్రిలింగం.త్రిలింగ రాజ్యాన్నేలే రాజుకి లోకజ్ణానం,కార్యధీక్షత పుషకలం. త్రిలింగ రాజుకి ఇద్దరు బార్యలు. మొదటి బార్య-రాజ్యం, రెండో బార్య-చిత్ర. మొదటి బార్య సంతానంలో ప్రధముడు జయుడు.రెండో బార్య
సంతానంలో ఆఖరివాడు మృత్యుంజయుడు. రాజ్యంకి చిత్ర సవతి అవ్వటంతో చిత్రతో పాటు చిత్ర సంతానాన్ని ఎరుసుగా చూసేది రాజ్యం. రాజ్యమేకాక త్రిలింగ ప్రజలు కూడా చిత్ర,చిత్ర సంతానం పై సవతి ప్రేమే చూపేవారు. త్రిలింగరాజు అకాల మరణం చెందుతాడు. ఇరు బార్యల పిల్లలకు రాజ్యమేలే పరిణితిగాని,వయసు గాని లేక పోవడం వల్ల చేసేది లేక కొన్నాళ్లు త్రిలింగరాజ్యాన్ని రాజ్యం చుట్టాలు, మరి కొన్నాళ్లు చిత్రం బంధువులు ఏలసాగారు. ఈ క్రమమంలో ప్రజలు ప్రలొబులవ్వడమో లేక విధి వక్రించడమో గాని ఆ త్రిలింగ రాజ్యం వీరిరువురి బంధువుల చెరలోనే బంధీయై పోయింది. ఎక్కడ
చూసిన అవినీతి, వారి వారి హయాములో ఎవరికి ధొరికినంతది వారు దోచుకోసాగారు. ప్రస్తుత రాజుల ఆగడాలు భరించలేక ఇరురాణులు చెరోదిక్కుకి పోయి తలదాచుకున్నారు. రాజ్యం మొత్తం అప్పులు,అవినీతికి నిలయంలా తాయారు చేసారు. త్రిలింగ రాజ్యం కాస్తా ఇష్టారాజ్యంగా మారిపోయింది. సామంత రాజులు,కప్పం చెల్లించే రాజులు, మూర్ఖులు, ముష్కరులు రాజ్యమేలడానికి ఎగబడటం త్రిలింగ రాజ్యం వారి చెరలొ బంధి అవ్వడం జరిగింది. కొన్నేళ్లు గడిచాక ఇరురాణుల సంతానం ఎదిగి వచ్చారు. జయుడు పరిణితిచెందిన లోకజ్ణానం గలవాడుగా, మృత్యుం జయుడు పరిణితిచెందిన కార్యశీలిగా ఎదిగివచ్చారు.

జయుడు రాజనీతి+లోకజ్ణానం బాగ తెలియడం వల్ల ఎవరితో అంతగా కలయక యే కార్యానైనా నాయ్యంగా, నియమబధంగా సాదించవచ్చనే వంటరిగా ఉండిపోయాడు. అన్ని విషయాలను నాయ్యంగా,నియమభధంగా ప్రజలకు భొధపడేలా చెప్పి వారిని ఉత్తేజులని చేయ్యాలని ప్రయాస పడేవాడు. ఐతే మృత్యుం జయుడుకి
జయుడుకున్నంత లోకజ్ణానం కాని రాజనీతికాని తెలియవు, కాని ఏ కార్యానికైనా ముఖ్యులతో కలసికట్టుగా ఉండి; అందరిలో ఉన్న విజ్ణానం,పరిజ్ణానంతో తన లౌక్యంజోడించి విజయం సాదించవచ్చని ప్రగాడంగా నమ్మేవాడు. కావున త్రిలింగరాజ్యానికిక సామంత రాజుల, కప్పం చెల్లించే రాజుల, మూర్ఖులు, ముష్కరుల చెర నుంచి విడిపించాలని ఇద్దరు నడుంబిగించిరి. ఇరువుర తల్లులవద్ద ప్రతిజ్ణ పూని రాజ్యసాధనకై బయల్ధేరుతారు. జయడు తన మార్గంలో ఎవరైతే తన కంటికి న్యాయంగా, నీతిగా కనిపిస్తారో వాల్లని
తనతో కలుపుకుని ముందుకి కొనసాగుతువుంటాడు. ఐతే మృత్యుం జయుడు తనతో ఉంటాను అని నమ్మబలికిన ప్రతీవాడిని కలుపుకుంటూ పోతుంటాడు. ఆఖరికి ఒక చోటు ఇరువురు అన్నతమ్ముళ్లు కలుస్తారు. ఇరువురు అన్నతమ్ముళ్ల వర్గంకి చెందిన వాళ్లు,అన్నతమ్ముళ్ల అంతరంగాలు చుచాయిగా తెలుసుకున్న పిమ్మట వీరు గొప్పంటే వీరు గొప్పని ఎద్దేవా చేసుకోసాగారు. అదే మర్రి చెట్టుపై ఎప్పటినుంచో నివాసముంటున్న ఒక రాక్షసి ఇది గమనించి తన వంతు సహాయం తాను చెయ్యాలని అనుకుంటుంది. ఇంతలో చీకటిపడటంతో అందరు ఆ మర్రి చెట్టు కింద సేదతీర్చుకుంటారు . నడిరేయిన ఆ
రాక్షసి ప్రత్యక్షమై ఒక గుఱ్ఱాని చూపి, ఈ గుఱ్ఱం ఎంతటి కష్టమైన విజయానైనా సునాయాసంగా తెచిపెట్టగల సత్తాగలదని నమ్మబలికి ఇరువురిలో ఎవరో ఒకరిని తీసుకోమని విన్నవించుకుంటాది. విజయుడు ఏదైనా న్యాయంగా, నిజాయితిగా సంపాదించాలని తపన వల్ల ఆ రాక్షసి యొక్క విన్నపాన్ని సవినయంగా తిరస్కరిస్తాడు. ఇక మృత్యుం జయుడు ఆలోచించక ఆ గుఱ్ఱంని తీసుకొని వెళ్తాడు."
అక్కడితో బేతాళుడు కధనుఆపి, "ఇప్పుడు చెప్పు రాజా! రాజా విక్రమార్ఖా!!నీతినిజాయితిలను నమ్ముకున్న జయుడు జయకరుడా లేక నలుగురుమాటలు విని తన లౌక్యంతో ఉండే మృత్యుం జయుడు జయకరుడా? ఇంతకి వీరువురిలో ఎవ్వరు కార్యం సాదించగలరు? ప్రజలు ఇరువురిలో ఎవ్వరిని అనుసరించాలి? ఈ మూడు ప్రశ్నలకు జవాబులు తెలిసి చెప్పని ఎడల నీ తల వెయ్యివ్రక్కలగును గుర్తుంచుకో రాజా!".
అంతట విక్రమార్ఖుడు -"బేతాళా! ఇందులో సందేహమేముంది, ఇద్దరు జయకరులే ఐతే చిక్కల్లా వాళ్ల లక్ష్యంలో ఉంది. ఇప్పుడున్న కాలంలో జనాలకు న్యాయం కంటే లౌక్యం దే పైచేయి. ఏకార్యమైనా సాదించాలంటే న్యాయమొక్కటే ప్రదానం కాదు. విజయం అనే వడ్డణలో న్యాయం లవణం లాంటిది. అంటే వంటకంలో ఆఖరున ఉపయోగించే పధార్దమన్నమాట. వంట పాకాన పడినప్పుడు తగిన ఉప్పు వేయటం మంచిదిగాని, ఉప్పును బట్టి వంటకం తయారు చేయడం ఏమంత మంచిది కాదు. అదేవిధంగా ఒక్క లవణంతోనే వంటకం వండలేము. వండడానికి పాత్రలు,కట్టెలు,తిండి పదార్ధాలుతో లవణంకూడా కావాలి. త్రిలంగరాజ్యాన్ని ఏలుతుంది మంది మార్బలం గల క్రూర రాజులు. అంటే క్రూరమైన మంది మార్బలం గల రాజుని న్యాయం ఒక్కటే ఒడించగలదు అని అనుకుంటే పొరబాటే. దానికి కార్యదీక్షత, అన్ని వర్గాల వారిని కలుపుకుని
అందరి సలహాలు+వ్యూహాలు పరిగణంలోకి తీసుకొని, లౌక్యంతో మంచి సలహాలు, వ్యూహాలు అమలు చేయడంతో విజయాన్ని సునాయాసంగా సాదించవచ్చు. క్రూరులను ఓడించి విజయం సాదించాక ప్రజలకు సగం న్యాయం జరిగినట్టే. మిగిలిన న్యాయం ఎక్కడ అనుచితంగాలేదో తేల్చుకుని మిగతా న్యాయం చేకూర్చాలి. విజయంతో సగం న్యాయం చవిచూసిన ఏ కార్యశీలైనా కచ్చితంగా పూర్తి న్యాయ సాధనకై
పాటుపడుతాడు."
"జనాలు నీతి నిజాయితీలు తెలుసుకుని ,న్యాయపోరాటం చేసేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.ఈ పంధానే పాటిస్తే విజయుడి ముని మనుమలు కాలంలో కుడా విజయం సాదించలేరాయే. తనకు దొరికిన అన్ని అవకాశాలు చెజార్చుకోకుండా చేతబుచ్చుకుని ముందుకు ఎవరైతే సాగుతారో వాళ్లకి విజయం తధ్యం. కావున ఇవన్ని లక్షణాలున్న మృత్యుం జయుడు గుఱ్ఱం అనే అవకాశం ను చేజార్చకుండా ఉపయోగించుకున్నాడు. తనకు దొరికిన అన్ని అవకాశాలు చెజార్చుకోకుండా చేతబుచ్చుకుని ముందుకు సాగాడు. అలాగే త్వరగా విజయం సాదించబోతాడు."
"విజయం సాదించి పెట్టగలవాడు, మిగిలిన సగభాగమైన సమాజన్యాయం చెయ్యక మానడు. కావున ప్రజలు మృత్యుం జయుడుకి అండగానిలబడి అనుసరిస్తారు."

విక్రమార్ఖుడు నోరువిప్పి బేతాళుడి ప్రశ్నలకు జవాబులివ్వడంతో బేతాళుడు ఎగురుకుంటు మళ్లీ చెట్టెక్కినాడు.
*****

ఓ ఒటరా! పై కదలో త్రిలింగం - మన ఆంద్రరాష్ట్రం అనుకుంటే, రాజ్యం - రాజకీయ రంగం, చిత్ర - సిని రంగం,
విజయుడు - జయప్రకాశ్ అనుకుంటే, మృత్యుం జయుడు - చిరంజీవి. ఈ ఇరువురిలో ఎవరికి మద్దత్తు పలకాలి, ఎవరిని అనుసరించాలి అని తర్కంగా ఆలోచిస్తూ కూర్చుంటే, న్యాయ పోరాటంకై అందరు సన్నధమైనంతవరకు వేచి చూస్తే దేశాన్ని దోచుకోవడమే వ్యాపకంగా పెట్టుకున్న మిగిలిన వాళ్లు మన నిలువ నీడనికూడా దోచుకుంటారు! తన్మాత్ జాగ్రత్త!! సో విజయమనే వడ్డన అయ్యాక, విజయాన్ని తెచ్చిన వాడితోటే న్యాయ సమాజం నిర్మింపజేయిద్దాం. అంతేగాని న్యాయ సమాజం నిర్మించాక విజయం కోసం ప్రాకులాడటం ఎంతవరకు సముచితమో ఆలోచించండి. అందులోనూ ఇప్పటి వరకు ఎకాధిపత్యపు రాజకీయ నాయకులనే చూసాం. మల్లి ఒకరితోటే నడిచే రాజ్యం వద్దు, సమిష్టి విజ్ఞావంతుల పరిజ్ఞానంతో నడిచే రాజ్యాన్నే ఎన్నుకుందాం. పుణ్యకాలం కాస్త గడవక ముందరే మనం మేల్కొందాం మన ఒటు అనే అస్త్రాన్ని సముచితమైనవాడికి వేద్దాం!

0 comments:

Post a Comment