Sunday, April 26, 2009

ఎట్టుకేలకి Jr.NTR లేచి నుంచున్నాడండోయి?!?!


ఏంటి మొన్నటి వరకు కూడా నుంచునే స్థితిలో లేని వ్యక్తి ఓటు
వెయ్యడానికి తోపుడు బండిలో పడుకొని, పడుకొని కూడా నడుంకి దన్నుగా ఉండటానికి వెడల్పాటి పట్టి కట్టుకుని మరీ ఓటేసిన భయ్యా Jr.NTR హటాత్తుగా మూడు రోజుల్లోనే నుంచున్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారా?
- మీరే కాదండి, నాలుగు కోట్ల ఏభై లక్షల పైచీలుక ఓటర్లందరికి(అదేంటి ఐదు కోట్ల ఏభై లక్షల పై చీలుక ఓటర్లుండగా
నాలుగు కోట్ల ఏభై లక్షల పైచీలుక అంటున్నాననా? అదేనండి తెలుగు దేశానికి కొంత మంది నమ్ముకుని బతికే వాళ్ళుంటారుగా ) అదే ప్రశ్న మదిలో దోలుస్తుంది. ఐతే తెరవెనుక ఏం జరిగిందనే విషయాన్ని క్షున్నంగా పరిశీలిస్తే తెలిందేంటి అంటే సినేమాల్లేక కాళీ పకోడిలా కూర్చున్న Jr.NTR కి ఒక మంచి ఆలోచన వచ్చింది. తన స్వీయ రచనలో సినిమా తీస్తే ఎట్టున్టాది అని దివ్య మైన ఆలోచన రాగానే పనిలో పనిగా ఎన్నికల సమయంలో రూపం దాల్చింది. సినిమా పేరు 'తారక్ మరో జన్మెత్తాడు', ట్యాగ్ లైన్ 'మీ కర్మ కాలి'
తారాగణం: మన కాళీ పకోడీ తారక్ వీరో, స్వీయ
దర్శకత్వం గదా కావున వీరోయిన్ లేదాయే
మిగతా నటీనటులంతా మీకు తెలిసిన తారక్ కి జై కొట్టే బందు వర్గమే .
మాటలు: పరుచూరి బ్రదర్స్
పబ్లిసిటీ: ఈటీవీ, టీవీ9, టీవీ1, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, మిగతా చిన్న చితకా మీడియా వర్గాలు.
కధ-కధనం-మేకప్-కాస్ట్యూములు-దర్శకత్వం-సమర్పణ
అంతా మన భయ్యా తారకే.
కధ విషయానికి వస్తే వాడి వేడి ఉన్న కధాంశం. టక్కు టమారి గోకర్ణ విద్యలు ఎలాగు ఉంటాది. క్లుప్తంగా చెప్పాలంటే తిరుగులేని కధాంశం మరియు కొత్త వొరవడి సృష్టించే కధాంశం. షూటింగ్ 30 రోజుల్లో తియ్యాలని ముందు అనుకున్నారు ఐతే విధి వక్రించో లేక మన భయ్యా డయిలాగులు రిహార్సల్స్ చేస్తూ బండి తోక్కడంతోనో, లేక కాంగ్రెస్ వాళ్ళ దృష్టి(పాపిష్టి కళ్లు) వల్లనో, లేక ఇతర పార్టీల వారు కుట్రో గాని షూటింగ్ మధ్యలోనే పెద్ద ఏక్సిడెంట్ జరిగింది. అది ఎంత పెద్ద
దంటే భయ్యా తలుచుకున్నాలు మంచంపైనే ఉండేటట్టు హమ్మయ్య పర్వాలేదు అనుకుంటే టక్కున లేచి కుర్చునేటంత పెద్ద ఏక్సిడెంట్.
ఫైటింగ్ లేని సినిమా ఆయే కావున సినిమా మంచి రసపట్టు ఉండాలంటే ట్విస్ట్లు ఉండాలిగా, కావున ఈ
ఏక్సిడెంట్ నే రసవత్తరంగా అందరకి కళ్ళ గట్టె తట్టు చిత్రించి చూపించటానికి ఆల్రెడీ ఈనాడు తన బుజాన్న వేసుకుని పొల్లు పోకుండా చిత్రించి చూపించింది. ఇక కొత్త వొరవడి సృష్టించే కధ గనుక, మంచం మిధనుంచే కాల కృత్యాలు(అయ్యో ఎ ఛానల్ వాళ్ళు ఇవేమీ చూపించలేదు గదు), అదేనండి సెన్సార్ బోర్డు వాళ్లు కత్రించేసారు లేదంటే అవ్వన్నీ చూపించే వారే ఈ మీడియా వాళ్ళు. సెన్సార్ బోర్డు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిన మంచం నుంచే నేరుగా ప్రసార సన్నివేశాలని మాత్రమే చూప నిచ్చారు. ఇదే ఈ సినిమాకి మహా హయ్యి లైటు ఐతే సాంకేతిక లోపాల వల్లనో లేక వేరే కారణాల వల్లనో కధను ఎలా ముగించాలో తెలియక మొత్తానికి ఎందుకు ఇన్నాలు పడుకోపెట్టారో, హటాత్తుగా ఎందుకు నుంచో పెట్టారో చెప్పకుండానే సినిమా ముగించారు.

అంతర్లీనంగా అర్ధమయ్యే విషయం: మూడో పర్వం ఎన్నికల ఉండుంటే కచ్చితంగా అప్పటివరకు తోపుడు పెట్టిపైనే ఉంచే వారు ఐతే ఎన్నికల పండగ అయ్యిపోయింది కదండి, ఎన్నాలని నట్టిస్తాడు / నట్టింప జేస్తారు చెప్పండి.

Friday, April 17, 2009

నందమూరి వంశోద్దారకుడైన బాల కృష్ణ కి ఓ నూలు పోగు.

"తొలి దశ పోలింగ్ లో మహా కూటమి నిశబ్ద విజయం వరిస్తుంధంట" - అని ది గ్రేట్ నందమూరి వంశోద్దారకుడైన బాల కృష్ణ కి ఓ నూలు పోగు.
బాలయ్యా! నిశబ్ద విజయం, నిశబ్ద విప్లవం అంటే ఏంటో తెలుసా నీకు? అది తెలుసుంటే ఈ రోజు నా లాంటి సామాన్యుడి చేత నువ్వెందుకు ఎకించుకునే సదవకాశం కలిపిస్తావు చెపు? రెండు వర్గాల మద్యనో, రెండు గుంపులు మద్యనో, లేదంటే ఉన్న వర్గాల మద్యనో, ఉన్న గుంపుల మద్యనో పోటి గాని పరీక్ష గాని జరుగుతున్నపుడు అప్పటి వరకు ఉనికిలేని/ఎవరు పట్టించుకోని వేరే వర్గమో/వేరే కొత్త గుంపో ఇతరులకి ఉన్న విజయవకాసాలని కొల్లగొట్టి దిగ్విజయం సంపాదిస్తే దాన్ని "నిశబ్ద విజయమని" అంటారు. అదే ఉన్న వర్గాలో/గుంపులో అవలంబిస్తున్న విధానాలను ఉనికిలేని/ఎవరు పట్టించుకోని వర్గం/గుంపు ఎందకడితే/నిలువరిస్తే అప్పుడు నిశబ్ద విప్లవం అంటారు. ఏ నిఘంటువుని తిరగేసినా ఇదే జవాబు నీకు దొరుకుతుంది.
ఓ నందమూరి వంశోద్దారకా! తెలుగు తనానికి వాడి వేడి గాడి చూపించింది మీ వంశమే అని విర్ర వీగుతున్నారుగా, ఈ మాత్రం అర్ధం తెలియదా? మామూలిగా మా బోటి బుర్రతక్కు నాయాల్లకి నీవిచ్చే సంజ్ఞలు మిడి మిడిగానే అర్ధమయ్యి అర్ధమవ్వనట్టుగా ఉంటాయి. అటు నువ్వు రెండేలు దేనికూపుతున్నావో, ఏ అవసరంతో ఊపుతున్నావో తెలియక నిశ్చేస్టులై చూడడం తప్ప, ఆ
సంజ్ఞల కి అర్ధమేంటి అని అడిగే ధైర్యం లేదాయే. ఇటు ఏదో నీకు విచిత్రంగా తోచిన పదాలను, ఉపమానాలు వాడేసి బలవంతంగా మాచేత ఈలలు వేయించేసి అటు నీ ఉడతా భాత్యాని మీ కూటమికి చాటుకుంటుంటే కుడా ఏమనలేని వెర్రి బాగులోల్లం. ఎంత పిల్లి అయినప్పటికి బంధించి కొడితే తిరగబడక మానదని నీకు బాగా తెలిసిందే. ఇక నీ తెగులు చలోక్తులు, ఉపమానాలు జీర్ణించుకోలేక నిన్ను నిలదీసే ధైర్యం కట్టలు తెంచుకుని మరీ ఉరికి వస్తుంది. 27 ఏళ్లగా తెలుగుకి హుందాతనం ని తెచ్చి పెట్టారని( మీ వంశం లో వారు మీకు మీరే ఉహించేసుకుని) సొంత డబ్బా కొట్టుకునే మీ వంశం, సందోర్భచితంగా మాట్లాడకుండా ఇలా ఇష్టానుసారంగా పదాలు వాడేస్తూ ఈ పిచ్చ ప్రజానీకాన్ని ఇక పల్టి కొట్టించలేవు బాలయ్య!
అసలు మీ బావకి విజయం వరించదని గంట్టాపధంగా నమ్మినతరువాతే కాదా అతుకు బోతుకు లోని మిగతా పార్టీలతో లోపాయికరమైన కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ పై స్వైర విహారం చెయ్యడానికీ సన్నధం అయ్యింది. పంచలోహాల్లా మీరంతా(తెలుగుదేశం, తే.రా.సా, సి.పి.ఐ, సి.పి.ఎం, పాల్ గారి పార్టీ ఐన ప్రజా శాంతి పార్టీలు ) ఒకరిగా ఇమిడి ఒకవేళ పొరబాటున మే 16 కాంగ్రెస్ పై విజయం సాధిస్తే దాన్ని అనుకున్న విజయం అంటారు గాని, దాన్ని నిశబ్ద విజయం అని ఏ కోశానా అనరు భాలయ్యా! ఒకవేళ, మొన్న మొన్ననే వచ్చిన ఇటు ప్రజారాజ్యం గాని అటు లోక్ సత్తా గాని విజయం వరిస్తే దాని నిశబ్ద విజయం అంటారు. నీకు అర్ధమయ్యే తట్టు నేను చెప్పాలంటే నాకు ఓ రెండు పెగ్గులు పడితే గాని ఆ పనికి పూనుకోలేను. ముందర ఆ పని కానిస్తా అందాక పిచ్చి పిచ్చి పద ప్రయోగాలు ఆపు బాల్లయ్య! మాకున్నఈ బోటి తెలుగు సాహిత్యాన్ని హత్య చేయ్యోధనేది గెట్టి మనవి. నువ్వు తెలుగు పదాలు వాడే ముందు ఇటు మీ వంశం, అటు తమరికి 35 ఏళ్ల తెలుగు సినిమా అనుభావుంధనేది మర్చిపోవద్దు సుమీ.

చురక: పంచలోహ పాతివ్రత్యాన్ని పటాపంచలు చేసే కార్బన్ స్టీల్ త్వరలో రాబోతుందే లే బాలయ్య!

Thursday, April 16, 2009

ఎవరి దమ్ము ఎంత ? - శ్రీ శ్రీ

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు కాందహార్ సంఘటన ని ముంబై 26 /11 ని పోలుస్తూ ముంబై ఘటన వారి ప్రభుత్వం ఎంత సమర్ధ వంతంగా ఎదుర్కొన్నారో వివరిస్తూ కాందహార్ విషయం లో అప్పటి ప్రభుత్వం చాతగాని తనాన్ని విమర్శిస్తూ జబ్బలు చరుచుకొన్నారు మన పంజాబ్ సింహం. కానీ నా లాంటి సామాన్య సగటు భారతీయులకి అర్ధం కానీ విషయం ఏంటంటే అసలు కాందహార్ కి ముంబై 26 /11 కి పోలిక ఏంటి అని. అప్పటి కాందహార్ సంఘటన మన భూభాగం మీద జరగలేదు మన విమానాన్ని హైజాక్ చేసి తాలిబాన్ పాలిత కాందహార్ కి తీసుకొని వెళ్తే, భారత దేశం అమెరికా లా వెంటనే ప్రపంచ దేశాలని కూడా గట్టుకొని ఆఫ్గనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదని మన ప్రధానమంత్రి గారు గుర్తించ లేక పోవడం కడు శోచనీయం. అప్పటి కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ ఉగ్రవాదులని తీసుకొని తాలిబాన్ పాలిత కాందహార్ లో అడుగు పెట్టారు కానీ ఇప్పటి ప్రభుత్వం లో ఏ ఒక్క మంత్రి కానీ అంత ధైర్యం చెయ్యగలరా అని నా సందేహం. తీవ్రవాదం పై యుద్ధం అంటే రోజుకి నాలుగు లేద ఐతు జతల దుస్తులు మార్చడం కాదని మన గౌరనీయ ప్రధానమంత్రి గారు గుర్తించాలి. ఒకప్పుడు శ్రీ వీ.పీ సింగ్ గారి మంత్రి వర్గం లోని శ్రీ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారి పుత్రిక రత్నం ని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తే అప్పుడు కూడా పలు కారాగారాల్లో ఉన్న తీవ్రవాదులని విడిచి పెట్టారని మన ప్రధానమంత్రి గారికి గుర్తు లేదో లేదా రాజకీయనాయకులు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు సామాన్య ప్రజల ప్రాణాలకంటే ఎక్కువ కనుక ఆ విషయం పట్టించుకోలేదో మరి. అప్పటి ప్రభుత్వం తీవ్రవాదులని విడిచిపెట్టడం తప్పు అంటోన్న మన గౌరనీయ ప్రధానమంత్రి గారు కాని, మన యువరాజు శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ లేదా మన మహారాణి శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ ఆ సమయంలో వీరైతే ఏమి చేసే వారో సెలవిస్తే నా లాంటి సగటు భారటీయులు వీరంతా నిజంగా ఎంతో దమ్ము ఉన్న వారని గుర్తించి మరో సారి పట్టం కట్టేవారిమేమో. కాని మీరు ఏమి చేసివుండే వారో చెప్పకుండా వారు చేసింది తప్పు అని అంటే మీ సమర్ధతని ఎలా అంచనా వెయ్యగలం చెప్పండి.

అసలు ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రధానమంత్రి అబ్యార్దులైన మీరు మరియు శ్రీ అద్వాని గారు ఒక వేదిక పై చర్చిస్తే మీ ఇద్దరి దమ్ము ఏమిటి అనేది మాకు అర్ధం అయ్యేది కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా నేను మీలా మాటకరిని కాను అంటూ శ్రీ అద్వానీ గారి పిలుపుని తిరస్కరించారు. పోనీ మీ పార్టీలో మరియు ప్రభుత్వం లో ఎందరో మాటకారులైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, శ్రీమతి జయంతి నటరాజన్ గారు, శ్రీ కపిల్ సిబాల్ గారు వారిలో ఎవరినైనా అద్వాని గారితో చర్చకు పంపాల్సింది మరి. కానీ వంద కోటల జనాభా కి ప్రాతినిద్యం వహిస్తూ నేను మాటకరిని కాను అని మీరే అంటుంటే మీరు ప్రపంచ వేదికలపై భారత దేశ వాణిని ఎలా వినిపిస్తారు అని మమ్మల్ని అనుకోమంటారు ప్రధాన మంత్రి గారు. ఇప్పటికైనా మీరు భారత ప్రధాని అని, కేవలం గాంధీ రాజ వంశానికి కాదని గుర్తిస్తారని ఆశిస్తున్నా.
మీరు మరో చక్కని విమర్శ చేసారు అద్వాని గారి పై, బాబ్రీ మస్జిద్ కులిపోతుంటే ఒక మూల ఏడుస్తూ కూర్చున్నారని కానీ మూడు వేల మంది అమాయక సిక్కు ప్రాణాలు మీ పార్టీ ముష్కరుల కారణంగా గాలిలో కలిసిపోతుంటే అప్పుడు మీరు ఏమి చేస్తున్నారో అని నాలాంటి వారికీ సందేహం రావడం తప్పు కాదేమో. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు మూడు వేల అమాయక సిక్కు ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ పార్టీ సహచరులకి మీ నాయకత్వం లోని ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం మీ చేతలని మీ దమ్ముని ప్రదర్శిస్తుంది. మీది చాలా దమ్మున్న ప్రభుత్వం శ్రీ మన్మోహన్ సింగ్ గారు !!!! - శ్రీ శ్రీ

Wednesday, April 15, 2009

రంగుల కల - శ్రీ శ్రీ

మన ఆదరనీయ ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక రోడ్ షో లో మాట్లాడుతూ కలర్ టీవీ లు వాటి వల్ల బడుగు జీవితాలు ఎలా బాగుపడతాయి అని సెలవిచ్చారు. విశేషాలు వారి మాటల్లోనే "మీరు ఎంతోకష్టపడి కూలి నాలి చేసుకొని ఇంటికి ఒచ్చిన తరువాత ఒక సినిమా నో ఒక సీరియల్ నో చూస్తే బాగా నిద్ర పడుతుంది విధంగా మీకు ఆరోగ్యం సమకూరుతుంది అని మీకు తెలియచేసుకొంటున్నాను"

చాలా బాగుందండి చంద్రబాబు గారు అయితే ఇక్కడ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి గత ఎన్నికలప్పుడు రైతులకిఉచిత విధ్యుత్ ఇస్తే తీగలమీద బట్టలు ఆరేసుకోవాలి అని సెలవిచ్చారు, మీ విజన్ 2020 తెలిసిన నా లాంటి కొంత మంది అది నిజమే అని నమ్మరు అనుకోండి అది వేరే విషయం కాని ఇప్పుడిప్పుడే మీ అసలు విజన్ అర్ధమవ్తుంది మాకు. అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే మీరు కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అని అనుకొందాం కాసేపు, మీరుమాట మీద నిలబడకపోయిన మీ బావమరిది గారైన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కానీ, మీ మేనల్లుడైన శ్రీ శ్రీ బుల్లినందమూరి తారక రామరావు గారు కానీ వీరెవరు కాకపోతే శ్రీ తారకరత్న గారు కానీ మీ పీక పట్టుకుని ఆయినా మీరుహమీలని అమలు పరిచేలా చేస్తారు అనుకొందాం.

రంకంగా మీరు మన 10 కోట్ల ఆంధ్ర జనాభాలో కనీసం ఒక 3 కోట్ల రంగుల టీవీ లు పంచి పెట్టారు అనుకొందాము మూడు కోట్ల టీవీ లు రోజుకి కనీసం ఒక మూడు గంటలు పని చేసాయి అనుకొందాము (సాయంత్రం కూలి నాలి చేసుకొనిఇంటికి వచ్చాకనే సుమీ ) మరి వాటికీ ఎంత విద్యుత్ కావాలి?
అంత విద్యుత్ కావాలంటే ఎన్ని విద్యుత్ కర్మాగారాలునెలకొల్పాలి? ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎంతో దూరదృష్టి ఉన్న మీరు గాని విదేశి విధ్యనబ్యాసించిన మన లోకేష్ బాబు గాని అలోచించి ఉంటారని ఆశిస్తూ మనమందరం విద్యుత్ తీగలమీద బట్టలు ఆరేసుకొనే అవకాశం రాకుడదనికోరుకొన్తూ - శ్రీ శ్రీ

Tuesday, April 14, 2009

ఓహ్ యువరాణి గారి వయసు తర్కం - శ్రీ శ్రీ

నిన్న మన యువరాణి శ్రీమతి ప్రియాంక వదర గారు అద్వాని కానీ మోడి కానీ యువకులా? అని ప్రశ్నించారు, కానీ పాపంవారి పార్టీ లో మరియు ప్రభుత్వం లో స్వంత కాళ్ళపై నడవలేని మంత్రులు ఉన్నారని ఉదాహరణకి శ్రీ అర్జున్ సింగ్ గారు, శ్రీ శివరాజ్ పాటిల్ గారు, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, పాపం మన యువరాణి గారికి తెలియక పోవడం చాల విచారించదగ్గ సంగతి.
- శ్రీ శ్రీ అర్జున్ సింగ్ గారు భారత దేశానికి మరియు భారత విద్యార్ధి లోకానికి దిశ నిర్దేశం చేయడానికి ప్రయత్నించి అలసి పోయారు కానీ వయసు అయి పోయి కాదు అని మనం అంత గుర్తించాలి మరి.
- నిన్నమొన్నటి వరకు వారి ప్రభుత్వం లో హోం శాఖను నిర్వహించిన శ్రీ శివరాజ్ పాటిల్ గారు అత్యంత పిన్న వయస్కులు అని మనందరం గుర్తించాలి, ఎందుకంటే శ్రీ శివరాజ్ పాటిల్ గారు యువకులతో పోటి పడుతు రోజుకి కనీసం నాలుగు లేదా ఐదు జతలదుస్తులు మార్చేవారు మరి.
- వారి ప్రభుత్వానికి ఊపిరి అందిస్తున్న శ్రీ కరుణానిధి గారు సందు చివరిలో పనీ పాట లేకుండా నుంచునే గుంపుకి గ్రూప్ లీడర్ లా కనీసండజను మంది చుట్టూ లేక పోతే గాని అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేరని మన యువరాణి గారికి తెలియదాయే!
- వారి ప్రదానమంత్రి అభ్యర్ధైన శ్రీ మన్మోహన్ సింగ్ గారిని పక్కన పెడితే వారి ప్రభుత్వం మొత్తం సరాసరి వయసు కనీసం 65 నుండి 70 వరకు ఉండొచ్చు అని నా అంచనా.
కానీ శ్రీ వాజపేయి గారి ప్రభుత్వం సరాసరి వయసు ఆయన్ని పక్కన పెడితే 60 కన్నాతక్కువే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన యువరాణి గారు ప్రస్తుతం యువరాజు గా ఉన్న మన రాహుల్గాంధీ గారు ఎప్పటికైనా భారతదేశానికీ ప్రధానిగా అయి మనలిని తరింప చేస్తారని సెలవిచ్చారు. కానీ విధంగా వారిప్రస్తుత ప్రదాన మంత్రి అబ్యార్ది అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారికి వయసు అయిపొయింది అని ఒప్పుకొన్నారు. కనీసం విధంగానైనా మనకి ఒక స్వంతంగా ( రిమోట్ కంట్రోల్ తో కాకుండ) నడవ గలిగిన ఒక ప్రధాని కాంగ్రెస్అందిస్తుందని ఆశిస్తూ - శ్రీశ్రీ

వాః అమ్మో వాః నాయినో... "పిల్లి గుడ్డిధైతే ఎలుక తోక పిల్లి చేతిలో పెట్టి నెమలీక ఇదే అని నమ్మిస్తాధంట!"

గాయాల నుండి కోలుకున్న మన భయ్యా జూనియర్ NTR నిన్న సాయంత్రం తన స్వగృహం నుంచి నేరుగా ప్రచారం అంటే నేను గంతులేసి మరి tv9 కి అత్తుక్కున్నా! ఏమి ఉచ్చారణ, మాట్లాడే విధానం లో ఏమి స్పష్టత, ప్రాస పొల్లు పోకుండా మాట్లాడే మన తెలుగోడి ప్రచారాన్ని చూసే సరికి అసలు సంగతి అప్పుడు అర్ధమయ్యింది - అది ప్రచారం కాదు, పక్కోలని హేళన ఎగతాళిల మాటల దండకమని. అయన మాటలు బట్టి నాకర్ధమయ్యింది ఏమంటే నందమూరి వంశానికే చిందింది ఈ ఆంధ్ర రాష్ట్రం అని, ఆంద్ర ప్రజానికమంత వాళ్ళ అడుగుల మడుగులేతాలనేది అయిన అభిమతంగా కనిపిస్తుంది. ఒక ఓటరుగా, ఒక బ్లాగర్ గా, ఒక ఆంధ్రుడుగా నా ఆవేదనని ఇక్కడ పొందు పరుస్తున్నా! భయ్యా అంటే పిచ్చ అభిమానమున్న పాఠకులకి ఒకింత ఇది మింగుడుపడదని నాకు తెలుసు ఐనా 27 ఎల్లున్న నవ యవ్వనపు పార్టీ నట్టేట్లో మునిగిపోతుంటే తన ఉడతా బత్తిగా తన ఒంతు సహాయం అందిస్తున్న భయ్యాని చూసాక స్పూర్తి పొంది ఒక ఆంధ్రుడునై, నిజమెరిగిన ఒక తెలుగు పౌరుడునై ఈ తెలుగు గెడ్డ పై పుట్టి 35 ఏళ్లగా ఆంధ్ర రాష్ట్రములో పెరిగిన నేను మన తెలుగు ప్రజానికి నా ఒంతుగా వివరించే ప్రయత్నమిది.

భయ్యా మాటల్లో: ఏ దేశమేగినా... ఎందు కాలిడినా... ఏ పీఠమెక్కినా.. ఎవరేదురైనా.. నిలపరా నీ జాతి నిండు గౌరవం...
భయ్యా! నువ్వు ఒక సారి ఆంద్ర రాష్ట్రం లో అందులోనూ అక్షరాశ్యత తక్కువన్న రాష్ట్రం లో ఉన్నావనేది మరవకు భయ్యా! సాధారణ మైన తెలుగు జనాలకి అర్ధమయ్యే భాషలో చెప్పు భయ్యా! ఈ స్టంటులన్ని సినిమాలో చెల్లుతాయి భయ్యా! సామాన్య ప్రజానీకంలో చొచ్చుకుని పోవాలంటే సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడు భయ్యా!
భయ్యా మాటల్లో: టీవీ లు లేని వారు భాద పడకండి తెలుగుదేశం అధికారంలోకి రానున్నది, చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మీ అందరికి కలర్ టీవీ లు ఇస్తారు
భయ్యా! టీవీలు లేని వారికి తెలుగు దేశం అధికారంలోకి రానున్నదని ఎలా తెలుస్తుంది? చంద్ర బాబు ముఖ్యమంత్రి అవ్వగానే వాళ్ళందరికీ కలర్ టీవీలు ఇస్తారని టీవీ లేని వారికి ఇలా తెలుస్తాది? భయ్యా! మరీ వెర్రి వెంగలప్పలావున్నావు నీ వాలకం చూస్తుంటే. కడుపు నిండుగా వున్నవాడు ఆకలి ఎరగడు అనేది జగత్ ఎరిగిన సత్యం. నువ్వు ఈ విషయం చెప్పవలసింది టీవీ లు లేక అల్లల్లాడుతున్న ప్రజానికానికి, అధివదిలేసి టీవీ లు చూస్తున్న వాళ్లకి చెబుతే వాళ్ళు నీ బంతులుగా పోయి ఇంటింటికి చెబుతారని ఏ ఆధారంతో నువ్వు ఈ మాటలు అంటున్నావు భయ్యా! అసలు నువ్వుంటున్న హైదరాబాద్ లో పేదల గుడెసలకు ఎన్నడన్నా వెళ్ళవా? కనీసం ఈ ప్రచార ఆర్భాట సమయమ లో నన్నా వాళ్ళ వంక తొంగి చూసావా? అటు మొన్న టీవీ9 వాళ్ళు ఒక సర్వే చెయ్యగా, రాష్ట్ర నడి బొడ్డున ఉన్న పేదల కుటీరంకి వెళ్లి అరా తియ్యగా వాపోవడం వాళ్ళ వంతయ్యింది. మరెందుకు భయ్యా చెవిటి వాళ్ళ వద్ద శంఖం వూది సంబర పడిపోతావు?
భయ్యా మాటల్లో:ఎన్నికలనే యుధం మొదలయ్యింది. ఈ యుధం లో 123 ఏళ్ల వృదాప్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉడుకు నేత్తురతో ఉరకలేస్తున్న 27 ఏళ్ల నీతివంతమైన తెలుగుదేశం.. ఆ తెలుగుదేశాన్ని బాల పరుస్తున్న మహా కూటమి మధ్య నడుస్తుంది.
భయ్యా! ఓ ప్రక్క నీతివంతమైన తెలుగు దేశం అంటున్నావు, మరో ప్రక్క 123 ఏళ్ల వృదాప్యంలో ఉన్న కాంగ్రెస్ పై యుధం అంటున్నావు అదీ గాక వృదుడి పై మహా కూటమి పోరు సాగిస్తుంది అని అంటున్నావు? ఇదేక్కడ నీతీ భయ్యా! ఏ నీతీ శాస్త్రం లో చూసిన యుద్దానికి కొన్ని నీతి నియమాలు కచ్చితంగా అందరికి అర్ధమయ్యేతట్టుగా చెప్పారు భయ్యా అందులోనూ యుధం అనేది సమ ఉజ్జీల తోనే ఉండాలి అనేది మొదటి నీతి భయ్యా! కాని ఒకని పై యుద్దానికి ఒకడే వెళ్లాలే గాని కుక్కల పందుల గుప్పుల వలె దాడి చేస్తే అది యుధమని ఏ నీతీశాస్త్రం లో రాసారో కాస్త చెబితే ఇక నుంచైనా నీతి అనే పదానికి అసలైన అర్ధం మేమందరం తెలుసుకుంటాము భయ్యా! ఐన తెలుగుదేశం పార్టీ సారూప్యం కి తెలంగాణా రాష్ట్రీయ సమితి సారూప్యానికి పొంతన ఏది? తెలంగాణా వేర్బాటు వెతిరేకుదారులైన కమ్యూనిష్టుల మధ్య కూటమి ఏంటి భయ్యా! మీ మావంటే వయసు పై బడింది గనుక ఇలాంటి ఫిలోసఫీలు మర్చిపోయాడను కుందాం, నువ్వేంటి భయ్యా - నువ్వు యువ నేతవి, తెలుగు తెజానివి, నీలో ఉడుకు రక్తం వురకలేస్తున్నది అలాంటి నువ్వే ఇలాంటివి ప్రోత్సాహిస్తూ తిరిగి మమ్మల్ని మీకు ఓటేసి మళ్ళీ మరో ఐదేళ్ళపాటు అవనీతిని మా పై రుద్దడానికి నీకు మనసు ఎలా వచ్చింది భయ్యా!
భయ్యా మాటల్లో:పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాం! తప్పు చేసాం!! చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏం లాభం?
భయ్యా! ఇంతకి పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ ని గెలిపించిందా? అంటే మాకు తెలియకుండానే మీకు మీరే మేచ్చ్ ఫిక్సింగ్ లు చేసేసుకున్నారా? మరెందుకు భయ్యా ఈరోజు ఇన్ని ప్రయాసలు చేసి మొత్తం మీ వెనుకనే ఉన్న మీడియాని ఉపయోగించి మమ్మలిని దద్దమ్మలు చెయ్యటం.
ఏంటి భయ్యా! మేమే ఓటు వేసి కాంగ్రెస్ గెలిపించాము అంటావా? అయితే నువంటున్న 'గెలిపించాం' అనేది మాకు ప్రతినిధ్యంగా మా ప్రతినిధిగా చెబుతున్నావా? భయ్యా ఏనా వెధవ నిన్ను మాకు ప్రాతినిధ్యం వహించమని వేడుకున్నాడు అదీ మాందరికి తెలియకుండా? మేమేమన్నా నందమూరి వంశం వాళ్ళమా నువ్వు మాకు ప్రాతినిధ్యం వహించడానికి, లేక ఆంధ్ర రాష్ట్రం ఎమన్నా మీ తాత జాగీరా? లేక మీ బాబు సొత్తా, ఏ ఆధారంతో మమ్మలిని నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నవో చెప్పు భయ్యా!
భయ్యా మాటల్లో:తెలుగు దేశం అధికారంలోకి వచ్చినప్పుడు రైతు బజార్లు పెడితే... కాంగ్రెస్ వాళ్ళిప్పుడు మందు బజార్లు పెట్టారు
భయ్యా! నువ్వు ఏ తెలుగు దేశం గురించి మాట్లాడుతున్నావో నాకైతే అర్ధం కావటం లేదు, ఒక పక్క తాత గారి ఏకైక వారసున్ని సొంత డబ్బా కొట్టు కుంటావు, మరో ప్రక్క మీ మావా చేసిన పనులతోనే మిగతా వాళ్ళని పోలుస్తున్నావు? ఇంతకి నీకు తెలుగు దేశం అంటేనే స్పష్టత లేదేమో భయ్యా! సర్గీయ మీ తాత గారు స్వయానా మందుని క్రమబదీకరించి వరుణ వాహిని అని నామకరణం పెట్టి ప్రభుత్వాలే ప్రజలనుండి మందు పై శిస్తు వసూలు చెయ్యొచ్చు అని నీతి మాలిన పని చేసి పెట్టడం వాళ్ళ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం లో అధికారానికి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ దాని ప్రోత్సాహిస్తుందంటే అదీ మీ తాత చలువే భయ్యా! తాత గారి గురించి అంత తెలిసిన వాడివి ఇవి తెలియవా భయ్యా? అంటే మీరే ప్రజలకి వాత పెట్టి మీరే వెన్న పూసి పై పెచ్చు పక్క వాళ్ళని ఆడి పోసుకుంటావు ఎం భయ్యా!
భయ్యా మాటల్లో:అన్న ఎన్టీఅర్, చంద్ర బాబులు నీతి మంతంగా, ప్రభుత్వ యంత్రాంగాన్నినీతీమంతంగా నడిపించారు!
బేష్ బయ్య! నీ అవగాహన రాహిత్యానికి శత కోటి దండాలు. భయ్యా! అన్న ఎన్టీఅర్, చంద్ర బాబులు నియంతలుగా ఈ రాష్ట్రాన్ని పాలించారు భయ్యా! చరిత్ర ని తిరగేస్తే తెలిసేది ఏంటి అంటే అన్న ఎన్టీఅర్ నియంతగా ఉండటం చంద్రబాబు కి అప్పట్లో నచ్చకే మీ తాతని నమ్మి అయన చెప్పిన తొత్తు గాళ్ళని మేమేన్నుకున్న వాళ్ళని కొనేసి రాత్రికి రాత్రి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికీ ముఖ్య మంత్రి అయ్యాడు. ఒకప్పుడు ఫ్రీ లకి వ్యతిరేకమైన ఈ చంద్ర బాబు నాయుడు, ఫ్రీలు మొర్రో అని ప్రజలు వెంట పడుతున్నాడు.
లో చంద్రబాబు కి ఇప్పుడు నువ్వు చెబుతున్నవే ఆ చంద్రబాబుకి చెట్టుకి చాన్తాడుకి ఉన్నంత తేడ ఉంది భయ్యా!. పరమ పదించిన వారు దేవుడుతో కోలిసే భూమి గనుక మీ తాత గారిని పక్కన పెడితే, ఓ ఓ నీతుమంతుడు అని తెగ డప్పు కొడుతున్న ఈ చంద్ర బాబు ఏ విధంగా నీకు నీతి వంతుడుగా కనిపిస్తున్నాడో కాస్తో కూస్తో బుదన్నఈ ప్రజానీకం అంతు చిక్కడం లేదు భయ్యా!
భయ్యా మాటల్లో:అర్ధ రాత్రి మహిళలు ఒంటరిగా తిరిగిన రోజే మన దేశానికి నిజమైన స్వతంత్రయమన్నారు గాంధీజీ
తూచ్ తూచ్.... మల్లి ఒక సారి చెప్పు భయ్యా! చూసావా తెలుగు దేశం వాళ్ళు ఎంత స్వార్ధ పరులో. మీరు గాంధీజీ ని వాడుకోవోచ్చా, తొక్కలోది వేరే పార్టీ వాళ్ళు వాడితే మీకు అది కిట్టదా, వాళ్ళంతా మహా మహులతో వ్యాపారం చేసుకుంటారా, మరి నువ్వేం చేస్తున్నావు భయ్యా మరి మీ పార్టీ ఎం చేస్తుంది భయ్యా! ఒకప్పుడు నటుడు నగార్జున్ కి మీ జన్మ భూమి కార్యక్రమం నచ్చి ఆ కార్యక్రమంలో పాలు గున్నపుడు మీకు అయిన మంచి వ్యక్తా? ఇవ్వాళా ఆయనికి నచ్చి కాంగ్రెస్ కి తానే స్వయంగా వెళ్లి ప్రచారం చేస్తుంటే ఆయనికి కాంగ్రెస్ తొత్తు అని బిరుదిస్తారా?
భయ్యా మాటల్లో:కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ వస్తే ఆంధ్ర రాస్త్రానికంటూ ఏమి మిగల్చుకుండా మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారంట.
భయ్యా ప్రతీ రోడ్ షోలో తెలుగు దేశం 27 ఏళ్ల వయసున్న నవ యవ్వనపు పార్టీ అని తెగ విర్ర వీగుతున్నావుగా మరి అట్లాంటి పార్టీకి ఎన్నికలకు 200 రోజులు ఉండగానే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దోచేస్తుందని గుర్తుకొచ్చిందా? లేక కాంగ్రెస్ వాళ్ళు దోచుకునే విధానం చూసి మీ పార్టీ వారు కుళ్ళు కుంటున్నారా? నువ్వు కుడా ఈ ఆంధ్ర రాష్ట్రం లో ఒక సగటు పౌరుడవి మర్చిపోకు, ఇన్నాలు కాంగ్రెస్ ఆంద్ర రాష్ట్రాన్ని దోచేస్తుంటే నువ్వు ఎం చేస్తున్నావు అని నేను నిన్ను అడుగుతున్న? అంటే నీ మావకి నీకు 1600 రోజుల్లో కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రాన్ని కొల్లగోట్టేస్తుందని తేలిసి కూడా ఎందుకు మమ్మలిని చైతన్యం చెయ్యలేదు అని అడుగుతున్న? అంటే మీకు అందలం ఎక్కే సమయానికి మీ ముసలి కన్నీలు చూసి మీకు ఓటు గుదేస్తామని ఎలా అనుకుంటున్నావు భయ్యా!
భయ్యా మాటల్లో:అన్న ఎన్టీఅర్, చంద్ర బాబులు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎంతో కృషిచేసారు
భయ్యా! నువ్వు చరిత్రని సరిగా అఖలింపు చేసుకున్నట్టు లేదు, లేదా నీకు ప్రసంగ పాటవాలు సమకూర్చిన వారికి సరిగా చరిత్ర తెలిసి ఉండదనేది ఇప్పుడు మాబోటి ప్రజానికానికి చాల సులువుగా అర్ధమవ్వుతుంది. గురజాడ అప్పారావు,టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు వీరంతా ఎవరు భయ్యా?. టీవీలో ఫ్రీ షో కదా అని నీ ప్రసంగ పాటవం రాసే వాడికి బుధి లేక పోతే నీకేమయ్యింది భయ్యా! నువ్వు అనుకుంటునట్టు మాకు గురజాడ అప్పారావు,టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు ఇత్యాది వారు మాకు ఆపాదించి పెట్టిన ఆత్మ గౌరవం చెక్కు చెదరకుండా భాద్యత ఉన్నా లేకున్నా ఆంధ్రులు అందరం కలసి కట్టుగా కాపాడుకుంటూనే ఉన్నాం. మరి నువ్వు అదేదో నందమూరి వంశం వాళ్ళు కృషి అంటావు, అంటే నువ్వు కూడా నందమూరి కూపస్థ మడూకానివే అన్న మాట. భయ్యా! 1983 ప్రజానీకం 2009 ప్రజనికంకి చాలా తేడా ఉంది భయ్యా! ఈ ఎన్నికలు అయ్యాక నీకు కాలి ఉంటె, ఉంటాదిలే వుండక చస్తాదా? బేరీజు వేసుకుంటే నీకు నువ్వే నిజాని నిగ్గు తెలుచుకోవోచ్చు భయ్యా!
భయ్యా మాటల్లో: ఇంకో వైపు ఇటీవలే వచ్చిన పార్టీ - 'ఇప్పటి దాక రెండు పార్టీలకు అవకాశమిచ్చారు.. తనకో అవకాసం ఇవ్వాలి' అని కోరుత్తున్నారు. ఇదేమైనా సినిమానా? అవకాసం ఇవ్వడానికి అని ప్రశ్నించారు? ఇదేమన్నా పెరంతమా బొట్టు పెట్టి పిలవడానికి?
భయ్యా! నీ క్రింద ఉన్న నలుపుని నలుగురికి పూసేస్తే జనాలందరు ఆ నలుగురినే నోరెళ్ళ బెట్టి చూస్తారని గొప్ప ప్లాన్ పన్నావు భయ్యా! భయ్యా ఒక సారి నీ డ్రెస్ చూసుకో భయ్యా, ఎప్పుడన్నా నీ జీవితం లో ఏ గడియలోనైన ఖాకి బట్టలు వేసుకున్నావా? కేవలం సినిమాల్లో నట్టించేటప్పుడు తప్పించి ఎప్పుడు వేసుకుని ఉండవు. అంటే ప్రజలు నీ ఆహార్యముని, కట్టు బట్టలని చూసి వాళ్ళ వాడు, శ్రామికుడు అని నమ్మిదామని నువ్వేం వేషం వేసావో? దీనేమంటారో చెప్పు భయ్యా? భయ్యా నువ్వు చేస్తున్నది ఎన్నికల ప్రచారం! సినిమా షో కాదు భయ్యా. ఏదో మీ తాత మా తల్లి తండ్రులను ఈ ఖాకి బట్టలు వేసుకుని నమ్మించి బుట్టలో వెసుకునందుకు అది వాళ్ళ ధౌర్భాగ్యమ్, తిరిగి ఏం ముఖం పెట్టుకుని ఆ ఖాకి దుస్తులు వేసుకుని మమ్మలిని నమ్మించడానికి వచ్చావు భయ్యా! అయినా భయ్యా తెలుగుదేశం 27 ఎల్ల యువ రక్తం ప్రవహిస్తున్న నవ యవ్వనపు పార్టీ కదా మరి నిన్న మొన్న మొలిచిన పార్టీ ని చూసి నీ(మీ)కెందుకంత భయం భయ్యా!
భయ్యా! పెప్సి కంపెనీ, కోకో కోలా కంపెనీ, మిగతా అంతర్జాతీయ కంపెనీలన్నీ పనికి రాణి కంపెనీలు అంటావా? అయితే మరి నువ్వు నీ నందమూరి వంశం వాళ్ళందరు వెళ్లి వాళ్ళ వానిధ్య ప్రకటనల్లో నట్టించోచ్చుగా, హి హి హి అంటే వాళ్ళు పిలవందే నువ్వెల్ల లేవన్నటే గా దీనర్ధం. అంతే భయ్యా నువ్వు, నీ స్థానం ఈ సంఘంలో ఉన్న ఆంధ్రులందరికీ తెలుసు భయ్యా!.

అయినా ఎం చూసుకుని మీ నందమూరి వంశీకులకు(పురందీస్వరిని మినహాయిస్తే) ఇంత తల బిరుసు, అహంభావం, పక్ష పాతం భయ్యా! అసలు నువ్వెవడివి భయ్యా! ఆఫ్టర్ అల్ మీ తాత అప్పటి కాలం లో మంచి నటుడు గనక ఆంధ్ర ప్రజానీకం నీరాజనాలు పట్టారు గనుక మీ తాతని మా తలలు తండ్రులు ఓటేసి గెలిపించారు భయ్యా, ఆ సమయమ లో నువ్వు గాని నీ మావ గాని ఉండి ఉంటె వాళ్ళు అసలు ఎన్నుకునే వారే కాదు భయ్యా! నువ్వు గాని, నీ మావ గాని, నీ భాబాయి గాని, మొతానికి నీ వంశంలో అందరు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తల బిరుసుగాల్లు భయ్యా. భయ్యా, మీ తాతే లేకుంటే ఈ రోజు నువ్వు ఇదే చంద్ర బాబు నయిడుని చూసి సగటు ఆంధ్రుడిలాగే యావగించుకునే స్థితిలో ఉండేవాడివి. నిజంగా నీలాంటోడు మా తరానికి గాని, భావి తరాని వాళ్లకి గాని ఎటువంటి మార్పూ తేలేరు భయ్యా. తుమ్మినా, దగ్గినా, ఏడిచినా, నవ్వినా మీ తాత పేరు జపించే మీరు మా ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడుతారా? అసలు ఇప్పుడున్న నందమూరి వంశంలో ఏ ఒక్కరికైన సొంత వ్యక్తిత్వం ఉందా? మీ బాబయేమో తోడబుట్టిన అక్కని మా కళ్ళ ముందే వ్యంగ్యంగా మాట్లాడి అవమానిస్తాడా? నువ్వేమో నీ రంగంలో ఉన్న నిష్ణాతులంటే నీకు నచ్చదాయేనా?, వారి పట్ల గౌరవ భావం ఉండదాయేనా?. భయ్యా, నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు జెమిని టీవీ లో ప్రత్యక్ష కారిక్రమంలో యాంకర్ నిన్ను చిరంజీవిగారి పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు నువ్వు ఆయనేవ్వరు అని జవాబిచ్చిన రోజే బుద్ధున్న ఈ ఆంధ్ర ప్రజానీకం నువ్వెంత అహంకారివో ఇట్టే పసిగట్టగాలిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ప్రజల్లో అహంకారానికి మచ్చుతునకగా చెప్పుకునే వ్యక్తిగా మిగిలావు. మీ తాతే లేకుంటే నువ్వు ఒక దూది పింజేతో సమానము భయ్యా! ఇక్కడ ఆంధ్ర ప్రజానీకం గుడ్డి వాళ్ళు కాదు భయ్యా! కళ్ళు మూసుకుని యెవరికి ఓటు వెయ్యాలో అలోచ్చిస్తున్నారు, అది చూసి నువ్వు నీ మంది మార్బలం, ప్రజలంతా గుడ్డి వారని నువ్వు గుడ్డిగా నమ్మి మాకు నేమలీకని ఇవ్వాలని చూస్తున్నావా? భయ్యా ఇది 20 వ శతాబ్దం కాదు భయ్యా! ఇది 21 వ శతాబ్దం భయ్యా! నువ్వు చెప్పే బూటకపు ప్రాస మాటలు విని ఆంధ్రులంతా తన్మయత్వం చెంది నీకు ఒటేస్తాము అని అనుకోవడానికి మేమేం ఈనాడు సంస్థ సభ్యులము కాదు, నందమూరి వంశం గాళ్ళం అంతకన్నాకాదు, నీవెంట తిరిగే వెర్రి నాగంమలం అస్సలు కానే కాదు, ఆఖరకు నీ మోచేతు నీళ్ళు తాగుతున్న వాళ్ళమైనా కాదు. ఇదే ఆంధ్ర ప్రజానీకం ఒక నాడు మార్పు ని కోరుకున్నారు గనుక మీ తాతని అందలం ఎక్కించిన పాపం మా తలలు తండ్రులు ఓడుగట్టు కున్నారు, ఇప్పుడూ మేము కుడా మార్పుని కోరుకుంటున్నాం అయితే మా తల్లితండ్రుల లా స్వామి భక్తికో, వ్యక్తి పూజకో లొంగే వాళ్ళం కాదు. ఎప్పుడో మార్పుకి నంది పలికాం అది కార్య రూపంలో ఉంది కుడా! మాకు ఎవ్వరిని ఎన్నుకోవాలో ఎవరిని ఎన్నుకోకూడదో నీకంటే మాకు ఎక్కువగా తెలుసు భయ్యా! నువ్వు మాగురించేమి బెంగ పెట్టుకోకు. సరేనా!

చివరి మాట
: నువ్వొక తాటాకు లాంటివాడివి భయ్యా! చప్పుళ్ళు చెయ్యగలవు తప్ప మార్పు తేలేవు. ఉండుండు అన్నటు మర్చిపోయా, నువ్వు కుడా భవిష్యత్తులో మా రాభోయే తరం వారి ఖర్మ కాలి నువ్వే ముఖ్య మంత్రి అవ్వలనుకున్నావనుకో, ముందర నీ అహంభావాన్ని పూర్తిగా హతమార్చుకో భయ్యా! రెండోది ఇక నుంచైనా నీ సినిమా పూర్తి నిడివిలో ఒక్కసారి కూడా నీ నందమూరి వంశం పేరెత్తకుండా, తాత పేరు కనీసం ప్రస్తావించకుండా తియ్యి భయ్యా! అది చాలు. బస్తి మే సవాల్ నువ్వు చెయ్యలేవు భయ్యా!!

Friday, April 10, 2009

ఎన్నికల్లో ప్రజారాజ్యంకి ఎన్ని బాల అరిస్టాలు ఉన్నా ముందంజలో ఉండటానికి కారణం? ఈ ఎన్నికల కార్తె లో మన రాజకీయ సింహాల పోకడ వల్లే!

సందర్భం: ఎన్నికల ప్రచారం
రోజా: అసలు చిరంజీవి ............... ముందర ప్రజారాజ్యం లో .............. చుసుకోమనండి........... చిరంజీవి............................... చిరంజీవి.............................. చిరంజీవి...........................
తెలుగుదేశం కార్య కర్తల్లో ఒక కార్యకర్త ధైర్యం చేసి రోజాకి, మేడం మనం మహా కూటమి గురిచి ప్రస్తుతించడానికి ఎన్నికల ప్రచారం లో ఉన్నాం. కాస్త మన పార్టీ విధి విధానాలు మాట్లాడితే మంచిదేమో, అందులోనూ మనికి ఉన్నది నాలుగే నలుగు రోజుల ప్రచార ఘడియలు. కార్యకర్త మాట పట్టించుకోకుండా తిరిగి చిరంజీవి....... చిరంజీవి........ చిరంజీవి........
దాంతో విసిగిన వేరొక కార్యకర్త చంద్రబాబుకి ఫోన్ చెయ్యగా, చంద్రబాబు ప్రసంగిస్తున్నారు కాస్త లైన్ లో ఉంటె ప్రసంగం అయ్యాక మాట్లాడొచ్చు అందాక ప్రసంగం విను అని చంద్రబాబు అంతరంగికుడొకడు సెలవిచ్చాడు, చేసేది ఎం లేక ఈ రోజా చిరంజీవి దంపుడు కంటే కాస్త చంద్రబాబు ప్రసంగం మేలు అని ప్రసంగం వినగా ఆశ్చర్య పోవడం వాడి ఒంతయ్యింది! అక్కడ కూడా చంద్రబాబు తన ప్రసంగం లో చిరంజీవి...చిరంజీవి.........చిరంజీవి................... ఒక పంక్తిలో కనీసం రెండు సార్లు చిరంజీవి జపం చెయ్యడం సహించలేక "తెలుగు దేశమా .... దాని అయ్య దేశమా.......... అనుకుంటూ జై చిరంజీవ అని ఎన్నికల ప్రచారం నుంచి పరుగు లగాయించాడు...

సందర్భం: కులం పేరుతో ఓట్ల ప్రచారం సాగిస్తున్నందుకు టెక్కలి పోలీసు స్టేషన్ లో అరెస్టు అయ్యిన సినీ నటుడు రాజశేఖర్ ఆ పై బెయిల్ మంజూరుతో మీడియా తో
విలేకరి: రాజశేఖర్ గారు మీరు మీ భార్య ఇప్పటి వరకు చాల నీతి నియమాలు పాటిస్తామని తెగ టముకు వేసారు, మేమిద్దరం తప్ప ఆంధ్ర రాష్ట్రం లో నీతి మంతులే లేరు అనే వారు అలాంటిది ఏ సందర్బాలలో మీరు ప్రలోభ చెంది కులం పేరున ఓట్లు అడుగుతున్నారు అని అడగగా..
రాజశేఖర్: ఇందుకు మా ఆవిడా జబాబు చెప్తాడు....వినండి.......ఓ జీవిత! వీడు అదేం చెబుతున్నాడు అడుగు, సారీ అదేం అడుగుతున్నాడు నువ్వు చెప్పు...
జీవిత: 'సినిమాల్లో సి.ఏం గా ' మోజు తీర్చుకోండి. ముప్పై ఏళ్ళ సినీ పరిశ్రమలో సంపాధించినదాని కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రజారాజ్యం మూడు నెలల్లో సంపాదించింది. సి.ఎం అవ్వడమనే కల ఇప్పటిలో నెరవేరదు......
దాంతో చిరాకు దోబ్బిన విలేకర్లు, జీవిత గారు మేం అడిగింది ఏంటి మీరు చెప్పింది ఏంటి. మాకు టైం లేక మీవద్ద చిరంజీవిగారిని ప్రచారం చెయ్యమని వచ్చామనుకున్నరా? అని రుస రుస లాడుతూ చిత్తగించారు.

కొస మెరుపు: ప్రజలు ఎల్లపుడూ కొత్త ధనాన్ని మార్పును కచ్చితంగా కోరుకుంటారు అనేది మీడియా ఎరిగిన నగ్న సత్యము. 60 ఏళ్ల అనుభవమున్న కాంగ్రెస్ కి, 27 ఏళ్ల వయసున్న తెలుగుదేశానికి ఎందుకు అర్ధం కావటం లేదో ఇటు మీడియా కి అటు ఓటరికి అంతు చిక్కని రహస్యం. ఎన్నో శతాబ్దాలుగా ప్రవహిస్తున్న కృష్ణ గోదావరి నదీ తీరానికి రోజూ పోయి ధ్యాన సంస్కారాలు అర్పించే వాళ్ళ కంటే పుష్కరినికే ప్రాముఖ్యత ఇచే వారెందరో అనేది ఎందుకనో, రాజకీయం ఒక వ్యాపారం గా చేసి నడిపించిన అటు కాంగ్రెస్ కి గాని, ఇటు తెలుగుదేశం కి గాని అర్ధమవ్వడానికి ఎన్ని పుష్కరినిలు పడుతుందో వేచి చూడాలి.

Wednesday, April 8, 2009

మనం ఎన్నుకున్న రాజకీయ నాయకీనాయకులకు ఈ ఎన్నికల్లో ఎన్నికళలో, ఎన్నికలలో?

సోనియా గాంధీ:
కళ: కట్టు బొట్టులతో హిందుత్వం ఆపాదించుకుని భారతీయులతో మమేకమని + హిందీ రాకున్నా, రాసుకున్న ప్రసంగాన్ని కాస్త అనర్గళంగా మాట్లాడగలను అని ప్రజలను భ్రమింప చేసే కళ గల నేర్పరి
కల: ఎలెక్షన్ టైం లోనే ప్రజలు రాజకీయ నాయుకుల మాటలు వినే దద్దమ్మ జనాలు ఉంటారని మహా నమ్మకం, దీనికి తార్కాణం - కేంద్రలో కాంగ్రెస్ కి ముఖ్యాంసం తెలంగాణమే అని నమ్మబలకడం. నమ్మబలికితే, ప్రజలంతా నమ్మేస్తున్నారని కల కనటం.

మాయావతి:
కళ: వైట్ కలర్ గూండా(స్త్రీలింగం లో ఏమంటారో నాకు తెలియదు గనుక ప్రస్తుతానికి గుండతో సరిపెట్టుకుందాం), రాజకీయ నాయకీ మొనార్కిజం. చందాలు విషయంలో ముక్కు పిండి మరీ వసూలు చేయగల కళ గల నేర్పరి
కల: దళిత గీతం పాడితే పిచ్చి ప్రజలు, అందులోనూ దేశం లో నలు దిక్కులలో ఉన్న జనులు తనని ప్రధాన మంత్రి పీటమేక్కిస్తారని పగటి కలలు గనటం.

జీవిత రాజశేఖర్:
కళ:
ఒద్దు మొర్రో అన్నా వినకుండా పిలవని పేరంటానికి వెళ్లి మరీ ప్రచారం పొందే ఆడపడుచు. ప్రతి చిన్న వ్యాపారానికి రిబ్బన్ కత్తిరింపుకి వెళ్ళేటప్పుడు మీడియాని వెంటబెట్టుకుని మరి వెళ్లి, అదికూడా ప్రజాసేవే అని మురుసిపోయే కళ గల ఆడపడుచు.
కల: ఈ మధ్య బడ్డీ కొట్టు ప్రారంబోత్సవంకి కుడా పిలవటం లేదని కలత చెంది, ఏంచెయ్యాలో తోచక చిరంజీవి పై కారాలు మిరియాలు నూరుతుంటే మీడియాలో కావలసినంత ఉచ్చిత ఊరేగింపు చూసి పొరబాటున తనని కూడా ప్రజలు ఓ MP గానో MLA గానో చూడాలని పట్టుపట్టి పిలుస్తారని కలలు గంటున్న కలహభోజి

రోజా:
కళ: సకలకళా వల్లభి. దేన్నైనా మసి పూసి మారేడు కాయ చేసే కళ గల నేర్పరి.
కల: తనపై ఉన్న బురదను ప్రజలు చుసేలోపు వేరొకరిపై జల్లితే పోలా, తనకి నచ్చని వారు పై బురద జల్లుతూ కలలు గానే తెగించిన తెలుగు జాణ.

రాజశేఖర రెడ్డి:
కళ: తన వెకిలి నవ్వుతోనే శత్రుసన్నిహుతులని సమర్ధంగా నేగ్గుకోచ్చే కళానైపుణ్యము గల ముఖ్యమంత్రి
కల: కాలినడకతో ప్రజల గుండెలు కొల్లగొట్టి ముఖ్యమంత్రి కాలేడు అని కలలు గన్న విశ్లేశుకులను మునుపటి ఎన్నికల్లో ఎలా బోల్తా కొట్టించాడో ఈ సారి కూడా తన మనోధైర్యంతో ముఖ్య మంత్రి పదవిని అలంకరిచగాలను అని కలలు కంటున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి

చంద్ర బాబు నాయుడు:
కళ: రాజకీయంగా బతక నేర్చి, ఏ ఎండకాగొడుగు పట్టగల సకల కళా వల్లభుడు. తను గన్న కలలు కోసం తన నియమ నిబంధ నమ్మకాలను కుడా తుంగలో తొక్కి తైతక్కలాడే కళా ప్రపూర్నుడు.
కల: ఉచితంగా విద్యుత్తు ఇస్తాను అంటే అందులో సాధ్యా అసాధ్యాలు తెలియని ఈ దద్దమ్మ ప్రజలు రాజశేఖర రెడ్డిని ఎలా గద్దె నేక్కిన్చారో, ఉచితంగా కలర్ టీవీ ఊరబ్బసోమ్ము మార్పిడి అంటే తనని కుడా ఈ ప్రజానికానికం గద్దె నేక్కిస్తాదని డోకా లేని కలలు గంటున్న చంద్ర బాబు నాయుడు.

కే.సీ.ర్:
కళ: పిచ్చజనంకి ఎం కావాలో తెలుసో లేదో తెలియదు గాని, రాజకీయనాయకీనాయకులనుంచి ఎం రాబట్టుకోవాలో, వాళ్ళని తన తెలంగాణా యాసలో ఎలా ఏక రేవుపెట్టాలో కిటుకులు తెలిసిన మహా కళాకారుడు మన కే.సీ.ర్
కల: ఈ గుంపు లో ఉంటె ఆ గుంపును బొందె పెడతాను అని మంగమ్మ సేపధం పట్టడం, ఆ గుంపు లో ఉంటె ఈ గుంపును బొందె పెడతాను అని నీళ్ళు నవలడం తప్ప కలలు కనటం తెలియని కళావిహీనుడు.

కొస మెరుపు:
ఇంతకీ ఓటరు తన అమూల్యమైన ఓటేసే వరకు ఏ నా రాజకీయనయికుడిని బలపరుస్తాడో తెలుసుకునే కళానైపుణ్యం కొరవడడం ఒకింత హాస్యా స్పదంగానే ఉంటుంది సుమీ. పోనీ కనీసం ఓటరు ఎటువంటి కలలు కనాలని అను కుంటున్నాడో కుడా తెలియని ఎదవ దద్దమ్మ రాజకీయ నాకులు మన రాజకీయ నాయకులు.

Monday, April 6, 2009

'ఈనాడు' పరకాయ ప్రవేశ విద్య కడు వైభవంగా కొనసాగుతుందా?

ఈ రోజు మన సమాజం లో ఉన్న ప్రతి వ్యక్తికి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే - ప్రక్కవాడు మనకోసం ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం. ఐతే ఇది ఎంతవరకు సాధ్యమో ఎవ్వరికీ తెలియదు, దీని కోసం చాల ఉద్దండులు తమ యొక్క విలువైన సమయాన్ని పాడుచేసుకున్న దాకలాలు ఉన్నాయి. ఇక్కడకిది కట్ చేస్తే...
ఈరోజు సమాజం లో పత్రికల పోరు యమ తీవ్రంగా ఉంది. పాఠకులకి సంచలన విషయాలను తామే ముందు చేర్చవేయ్యాలని తెగ కుస్తీ పడుతుంటారు. చెప్పాలంటే పాఠకులకు అన్ని పత్రికలూ కూలంకుసంగా చదివే తీరిక ఉండదూ అని ప్రతీ పత్రిక సంపాదుకునికి ఇది అవగతమే. ఐతే 'ఈనాడు' సంపాదకుడు సర్వశ్రీ రామోజీ రావు గారు మాత్రం అందరి సంపాదుకులకంటే ఒక ఆకు ఎక్కువే తిన్నారు. దీనికి తార్కాణం, పత్రిక విషయాలు విపలంగా సామాన్య పాఠకులకి సైతం అర్ధమయ్యేలా పొందు పరచడంలోను, వైవిధ్యమైన విషయాలను చర్చించడంలోను, నిజం చెప్పాలంటే తెలుగు దినపత్రికల్లో ఒక ట్రెండ్ ని సృష్టించిన రారాజు. ఐతే ఈ రోజు అవన్నీ ప్రతి పత్రికలో ఈ విషయాలను చూడవచ్చు. "అందరూ చాపల పులుసే వడ్డిస్తే ఎలా? తమ వారు మేచుకోవల్లన్నా, తన ఉనికి తెలియాలన్నా వైవిధ్యమైన చాపల పులుసు పెట్టి వడ్డించాలి". వైవిధ్యముగా పెట్టే నేర్పరి తనం ఉన్నపుడైతే పర్వాలేదు, కాని పెట్టే పులుసు లో ఆ వైవిధ్యం లేక పోతే????? అని సర్వశ్రీ రామోజీరావు గారు తలచి ఈనాడు పత్రికేయుకులందరికి పరకాయప్రవేశం విద్యను ఆఘ మేఘాలమీద నేర్చుకోవాలని ఒక హుకూం జారి చేసారు. అదేమన్న A,B,C,D నా ఇట్టే చెబితే అట్టే నేర్చుకోవడానికి? కావున ఈనాడు పాత్రికేయులంత నేర్చుకోలేక అఖాలంగా ఈ విద్యకి ఇంత ప్రాముఖ్యత ఎందుకని అర్ధం కాక అందరు చేతులెత్తేసారు. ఇది చూసి విస్తు చెందిన సర్వశ్రీ రామోజీరావు గారు ఆలోచనలో పడిన ఒకానొక సమయంలో తన పుత్ర రత్నమైన సుమన్ కి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. వెంటనే తండ్రికి తనకు తెలిసిన ఇప్పటి IT రంగం లో ఉన్న ఒక నానుడి చెప్పాడు 'when you cannot satisfy the user, you confuse the user'. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ చేష్టలతో సంతృప్తి చెందక పోతే వారిని అయోమయానికి గురిచేస్తే అర్ధం కాక ఎందుకులే ఈ పితలాటకం అని నువ్వు చూపే చేష్టలు కళ్ళార్పకుండా చూస్తారు అని దీనర్ధము. అంతటితో తన వారసుడు సాధారణ మనవిడి నాడిని ఇంత త్వరగా పట్టుకోవడాన్ని నమ్మలేక పోయాడు. కావున పాఠకులను అయోమయం గురిచేయ్యలంటే ఉన్నదీ లేనట్టుగా, లేనిదీ ఉన్నటుగా రాస్తే పోలా? పిచిజనంకి సత్య అసత్యాలు బెరీజువేసుకునే సమయమే ఉంటె ఈ రోజు కాంగ్రెస్ 60 ఏళ్ళు మన దేశాన్ని ఎలేవాల్లా? చచ్చినట్టు ఈ పిచ్చి అమాయకపు ప్రజలు నమ్మక చస్తారు అని అయిన విశ్వసించి తమ్మిని బమ్మిని చెయ్యడం, బమ్మిని తమ్మిని చెయ్యడం మొదలెట్టాడు.
మచుకకు కొన్ని:
- ప్రజారాజ్యంలో అసంతృప్తి రాజ్యమేలుతుంది (ఏదో మిగతా పార్టీలలో సంతృప్తి సుష్టిగా ఎలుతున్నట్టు!!!)
- తెదేపాకు చెందిన ఇద్దరు శాసన సభ అభ్యర్ధుల నమినషన్లు తిరస్కరించడంతో రాష్ట్రమంతా సంచలనం సృష్టించిందని అనడం (అందుకేనేమో ఈ సంచలాన్ని జీర్ణించుకోలేక ఆంధ్ర ప్రజానీకం నిద్రా హారాలు మానేసి మరీ పనీపాట లేకుండా కూర్చున్నారు)
- సీనియర్ నేతలు మిత్ర, పరకాల ప్రభాకర్, ఉపేంద్ర, కే.ఎస్.ఎం మూర్తి లతో పాటు మరి కొంత మంది( అంటే ఇంకా మిగతా వారి పేర్లు తెలిశాక అవి కుడా పొందు పరుస్తారు) కుడా పార్టీ పనితీరు పై అసంతృప్తి తో వున్నాటు తెలుస్తుంది( అవ్వాక్కు పోవడం మిత్ర, పరకాల ప్రభాకర్, ఉపేంద్ర, మూర్తి వంతయ్యింది)
- పులివెందుల నియోజిక వర్గంలో బాల కృష్ణ సభకు హాజరయిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు హెచ్చరిక జారి చేసారంట( సర్వశ్రీ రామోజీరావు గారి యూనిట్లో పత్రికా విలేకర్లు పనీ పాటా లేకుండా ఉన్నారు, వారంతా మారు వేషాలేసుకుని ఒకొక్క కాంగ్రెస్ కార్యకర్తో కలసి మమేకం అయ్యారన్న మాట, మొతానికి కాంగ్రెస్ ఇంటి గుట్టు ఈనాడు విలేకర్లు బజారున ఈడ్చాగాలుగుతున్నారు)
- కాంగ్రెస్ భూస్థాపితం ఖాయం అని CPI, CPM లు ఉద్గాటించినట్లు నమ్మబూనడం(౩౦ ఎల్ల చరిత్ర గల ఈనాడు సంపాదికీయం ప్రచిరుస్తున్న కాలం లో ఏనాడైనా CPM gaani, CPI gaani వేరే చిన్న చితక పార్టీలను ఓడించగలిగారా? ఇప్పుడు వీరు కాంగ్రెస్ ని భూస్తాపితం చేస్తారన్న విషయాన్ని ఈనాడు వారు మనకి నమ్మబూనడం)
ఇలా చెప్పుకు పోతే అంతే ఉండదు. కాంగ్రెస్ భవనం పై అరాచకం సృష్టించి వారికి వారే నిప్పంటించుకున్న ప్రభుద్దులు హాస్పిటల్ లో మరణ సేయ్యమిదుంటే, వారు మరణించే వరకు వారికి ఏమయ్యిందో కూడా జనానికి తెలియజెప్పే భాద్యత ఎరగని ఈ ఈనాడు; Jr.
NTR కదిలారు అని ఒకప్పుడు, కదుల్తారని ఇంకొకప్పుడు, ప్రచారం చేస్తారని ఒకప్పుడు, ప్రచారం చెయ్యలేని స్థితి అని మరొకప్పుడు - ఇలా వున్నది లేనట్టు లేనిదీ ఉన్నట్టు ప్రజలని అయోమయానికి గురి చెయ్యడం తప్ప వేరేధీ తెలియక ఈనాడు ముందుకు సాగుతుంది.
P.S: కాల చక్రం లో ఈరోజు ఆంధ్రుడికి 24 గంటలు సరిపోక తన పని తను చేసుకుని పోతున్నాడు గనుక ఇలాంటి పత్రికల టక్కు టమారి విద్యలు చెల్లుతున్నాయి గాని లేకుంటే ఎప్పుడో ఇవి భూస్తాపితం అయ్యి ఉండేవనిచరిత్ర చెప్పకనే చెబుతున్నాయి.

Sunday, April 5, 2009

ప్రముఖ పార్టీల గుర్తుల యొక్క అర్ధాలు పెడర్ధాలు

కాంగ్రెస్ గుర్తు హస్తం:
-----------------
అర్ధం: అభయ హస్తం, అవసరంలో ఉన్నా వాళ్ళకి సహాయం అందించే అభయ హస్తం. ఒంటరి హస్తం తో ఏక కలంలో ఒక్కరినే ఆదుకునే ఆపన్న హస్తం.
పెడర్ధం: హస్త లాగావ్యం, నెత్తిపై హస్తం, చేయ్యివడం, చేజార్చడం

తెలుగుదేశం గుర్తు
సైకిల్:
--------------------
అర్ధం: పేదోళ్ళ రధం, ప్రగతి రధం, పురోగతి వైపు నడిపించే రధం. ఒంటరి సైకిల్ పై ఏక కాలం లో ముందర ఒక్కరిని, వెనుక ఒక్కరిని ఎక్కించుకుని పురోగతి, ప్రగతి వైపు నడిపించే రధం. ప్రగతి వైపు పయనించాలంటే వేగం ఓ మోస్తరి.
పెడర్ధం: పంచ్చరైన సైకిల్, తుప్పు పట్టిన సైకిల్, పనికిరాని సైకిల్

తే.రా.సా గుర్తు కారు:
-----------------
అర్ధం: తెలంగాణా రధం, దొరల దోపిడీల బారి నుంచి కాపాడే రధం. ఒంటరి కారుపై ఏక కాలం లో ముందర ఇద్దరు(పట్టగలిగితే), వెనుక ముగ్గురు లేక నలుగురుని ఎక్కించుకొని దొరల దోపిడీల నుంచి రక్షించ గల సత్తా ఉన్నా కారు.
పెడర్ధం: స్టీరింగ్ లేని కారు, టైర్లరిగిన కారు, గతి తప్పిన బండి

లోక్ సత్తా గుర్తు ఈల:
------------------
అర్ధం: జాగృతి పరచడం, చైతన్య వంతులు చెయ్యడం. ఈలతో మేల్కొలిపి ప్రజలను చైతన్యవంతులని చేసి ప్రగతి వైపు నడిపించడం. ఏక కాలంలో కూత వేటులో ఉన్నవాళ్ళను మేల్కొలిపి ప్రగతి వైపు నడిపించడం.
పెడర్ధం: మొగని ఈల, మూగవోయిన ఈల

ప్రజా రాజ్యం గుర్తు రైలు ఇంజన్:
---------------------------
అర్ధం: సామజిక ప్రగతి రధం.
ఇంజన్ కి తగిలించిన భోగీలు ప్రయానికులకా లేక వస్తు రవాణాకా అనే తారతమ్యం లేకుండా సామాజిక నాయంతో ప్రగతి వైపు చైతన్యంతో నడిచే
అసలైన రధం, అలుపెరగని రధం. న్యాయం, నిస్పక్షపాతం అనే రెండు సమాన్తరపు బాధ్దీలపై మేధావర్గాల యొక్క ఆలోచనలనే చక్రాలతో నడిచే ప్రగతి రధం; సమాజం బిగ్గరిల్లె లా తన కూత తో జాగృతం చేసే రధం; తాను మోసేది ప్రయనికులైనా, ముడి సరుకులైనా తమ పర బేధాలు లేకుండా అన్ని వర్గాల వారిని రంజింపజేసే రధం; లక్ష్యాలు తరువాత లక్ష్యాలు, లక్ష్యాలు మించిన లక్ష్యాలు అలుపెరగకుండా పయనించే రధం; గరీబీలు(General),మధ్య తరగతి వాళ్ళు(S1,S2...), సంపన్నులనే(AC) తారతమ్యం లేకుండా వాళ్ల వల్ల లక్ష్యాలకు చేర్చే సత్తాగల రధం; కష్టించేవాళ్లు (Standing), నడిపించేవాళ్ళు(సిభంది) , కాలక్షేపించే వాళ్లు (sitting), సుకపడేవాళ్ళు(berth) ఇలా పలు వర్గాలకు ఉన్నపటికీ తమ పర అను బేధాలు లేకుండా నిర్దిష్ట గమ్యానికి చేర్చే రధం - అసలైన రధం, అసలు సిసలైన రధం, సామజిక ప్రగతి రధం, ప్రజా రాజ్యపు రధం.

పెడర్ధం: పట్టాలు తప్పిన రైలింజను, సతుకుల పడ్డ రైలింజను, అదుపు తప్పిన రధం.