నిన్న మన యువరాణి శ్రీమతి ప్రియాంక వదర గారు అద్వాని కానీ మోడి కానీ యువకులా? అని ప్రశ్నించారు, కానీ పాపంవారి పార్టీ లో మరియు ప్రభుత్వం లో స్వంత కాళ్ళపై నడవలేని మంత్రులు ఉన్నారని ఉదాహరణకి శ్రీ అర్జున్ సింగ్ గారు, శ్రీ శివరాజ్ పాటిల్ గారు, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, పాపం మన యువరాణి గారికి తెలియక పోవడం చాల విచారించదగ్గ సంగతి.
- శ్రీ శ్రీ అర్జున్ సింగ్ గారు భారత దేశానికి మరియు భారత విద్యార్ధి లోకానికి దిశ నిర్దేశం చేయడానికి ప్రయత్నించి అలసి పోయారు కానీ వయసు అయి పోయి కాదు అని మనం అంత గుర్తించాలి మరి.
- నిన్నమొన్నటి వరకు వారి ప్రభుత్వం లో హోం శాఖను నిర్వహించిన శ్రీ శివరాజ్ పాటిల్ గారు అత్యంత పిన్న వయస్కులు అని మనందరం గుర్తించాలి, ఎందుకంటే శ్రీ శివరాజ్ పాటిల్ గారు యువకులతో పోటి పడుతు రోజుకి కనీసం నాలుగు లేదా ఐదు జతలదుస్తులు మార్చేవారు మరి.
- వారి ప్రభుత్వానికి ఊపిరి అందిస్తున్న శ్రీ కరుణానిధి గారు సందు చివరిలో పనీ పాట లేకుండా నుంచునే గుంపుకి గ్రూప్ లీడర్ లా కనీసండజను మంది చుట్టూ లేక పోతే గాని అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేరని మన యువరాణి గారికి తెలియదాయే!
- వారి ప్రదానమంత్రి అభ్యర్ధైన శ్రీ మన్మోహన్ సింగ్ గారిని పక్కన పెడితే వారి ప్రభుత్వం మొత్తం సరాసరి వయసు కనీసం 65 నుండి 70 వరకు ఉండొచ్చు అని నా అంచనా.
కానీ శ్రీ వాజపేయి గారి ప్రభుత్వం సరాసరి వయసు ఆయన్ని పక్కన పెడితే 60 కన్నాతక్కువే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన యువరాణి గారు ప్రస్తుతం యువరాజు గా ఉన్న మన రాహుల్గాంధీ గారు ఎప్పటికైనా ఈ భారతదేశానికీ ప్రధానిగా అయి మనలిని తరింప చేస్తారని సెలవిచ్చారు. కానీ ఈ విధంగా వారిప్రస్తుత ప్రదాన మంత్రి అబ్యార్ది అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారికి వయసు అయిపొయింది అని ఒప్పుకొన్నారు. కనీసం ఈ విధంగానైనా మనకి ఒక స్వంతంగా ( రిమోట్ కంట్రోల్ తో కాకుండ) నడవ గలిగిన ఒక ప్రధాని కాంగ్రెస్అందిస్తుందని ఆశిస్తూ - శ్రీశ్రీ
Tuesday, April 14, 2009
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment