ఈ రోజు మన సమాజం లో ఉన్న ప్రతి వ్యక్తికి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే - ప్రక్కవాడు మనకోసం ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం. ఐతే ఇది ఎంతవరకు సాధ్యమో ఎవ్వరికీ తెలియదు, దీని కోసం చాల ఉద్దండులు తమ యొక్క విలువైన సమయాన్ని పాడుచేసుకున్న దాకలాలు ఉన్నాయి. ఇక్కడకిది కట్ చేస్తే...
ఈరోజు సమాజం లో పత్రికల పోరు యమ తీవ్రంగా ఉంది. పాఠకులకి సంచలన విషయాలను తామే ముందు చేర్చవేయ్యాలని తెగ కుస్తీ పడుతుంటారు. చెప్పాలంటే పాఠకులకు అన్ని పత్రికలూ కూలంకుసంగా చదివే తీరిక ఉండదూ అని ప్రతీ పత్రిక సంపాదుకునికి ఇది అవగతమే. ఐతే 'ఈనాడు' సంపాదకుడు సర్వశ్రీ రామోజీ రావు గారు మాత్రం అందరి సంపాదుకులకంటే ఒక ఆకు ఎక్కువే తిన్నారు. దీనికి తార్కాణం, పత్రిక విషయాలు విపలంగా సామాన్య పాఠకులకి సైతం అర్ధమయ్యేలా పొందు పరచడంలోను, వైవిధ్యమైన విషయాలను చర్చించడంలోను, నిజం చెప్పాలంటే తెలుగు దినపత్రికల్లో ఒక ట్రెండ్ ని సృష్టించిన రారాజు. ఐతే ఈ రోజు అవన్నీ ప్రతి పత్రికలో ఈ విషయాలను చూడవచ్చు. "అందరూ చాపల పులుసే వడ్డిస్తే ఎలా? తమ వారు మేచుకోవల్లన్నా, తన ఉనికి తెలియాలన్నా వైవిధ్యమైన చాపల పులుసు పెట్టి వడ్డించాలి". వైవిధ్యముగా పెట్టే నేర్పరి తనం ఉన్నపుడైతే పర్వాలేదు, కాని పెట్టే పులుసు లో ఆ వైవిధ్యం లేక పోతే????? అని సర్వశ్రీ రామోజీరావు గారు తలచి ఈనాడు పత్రికేయుకులందరికి పరకాయప్రవేశం విద్యను ఆఘ మేఘాలమీద నేర్చుకోవాలని ఒక హుకూం జారి చేసారు. అదేమన్న A,B,C,D నా ఇట్టే చెబితే అట్టే నేర్చుకోవడానికి? కావున ఈనాడు పాత్రికేయులంత నేర్చుకోలేక అఖాలంగా ఈ విద్యకి ఇంత ప్రాముఖ్యత ఎందుకని అర్ధం కాక అందరు చేతులెత్తేసారు. ఇది చూసి విస్తు చెందిన సర్వశ్రీ రామోజీరావు గారు ఆలోచనలో పడిన ఒకానొక సమయంలో తన పుత్ర రత్నమైన సుమన్ కి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. వెంటనే తండ్రికి తనకు తెలిసిన ఇప్పటి IT రంగం లో ఉన్న ఒక నానుడి చెప్పాడు 'when you cannot satisfy the user, you confuse the user'. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ చేష్టలతో సంతృప్తి చెందక పోతే వారిని అయోమయానికి గురిచేస్తే అర్ధం కాక ఎందుకులే ఈ పితలాటకం అని నువ్వు చూపే చేష్టలు కళ్ళార్పకుండా చూస్తారు అని దీనర్ధము. అంతటితో తన వారసుడు సాధారణ మనవిడి నాడిని ఇంత త్వరగా పట్టుకోవడాన్ని నమ్మలేక పోయాడు. కావున పాఠకులను అయోమయం గురిచేయ్యలంటే ఉన్నదీ లేనట్టుగా, లేనిదీ ఉన్నటుగా రాస్తే పోలా? పిచిజనంకి సత్య అసత్యాలు బెరీజువేసుకునే సమయమే ఉంటె ఈ రోజు కాంగ్రెస్ 60 ఏళ్ళు మన దేశాన్ని ఎలేవాల్లా? చచ్చినట్టు ఈ పిచ్చి అమాయకపు ప్రజలు నమ్మక చస్తారు అని అయిన విశ్వసించి తమ్మిని బమ్మిని చెయ్యడం, బమ్మిని తమ్మిని చెయ్యడం మొదలెట్టాడు.
మచుకకు కొన్ని:
- ప్రజారాజ్యంలో అసంతృప్తి రాజ్యమేలుతుంది (ఏదో మిగతా పార్టీలలో సంతృప్తి సుష్టిగా ఎలుతున్నట్టు!!!)
- తెదేపాకు చెందిన ఇద్దరు శాసన సభ అభ్యర్ధుల నమినషన్లు తిరస్కరించడంతో రాష్ట్రమంతా సంచలనం సృష్టించిందని అనడం (అందుకేనేమో ఈ సంచలాన్ని జీర్ణించుకోలేక ఆంధ్ర ప్రజానీకం నిద్రా హారాలు మానేసి మరీ పనీపాట లేకుండా కూర్చున్నారు)
- సీనియర్ నేతలు మిత్ర, పరకాల ప్రభాకర్, ఉపేంద్ర, కే.ఎస్.ఎం మూర్తి లతో పాటు మరి కొంత మంది( అంటే ఇంకా మిగతా వారి పేర్లు తెలిశాక అవి కుడా పొందు పరుస్తారు) కుడా పార్టీ పనితీరు పై అసంతృప్తి తో వున్నాటు తెలుస్తుంది( అవ్వాక్కు పోవడం మిత్ర, పరకాల ప్రభాకర్, ఉపేంద్ర, మూర్తి వంతయ్యింది)
- పులివెందుల నియోజిక వర్గంలో బాల కృష్ణ సభకు హాజరయిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు హెచ్చరిక జారి చేసారంట( సర్వశ్రీ రామోజీరావు గారి యూనిట్లో పత్రికా విలేకర్లు పనీ పాటా లేకుండా ఉన్నారు, వారంతా మారు వేషాలేసుకుని ఒకొక్క కాంగ్రెస్ కార్యకర్తో కలసి మమేకం అయ్యారన్న మాట, మొతానికి కాంగ్రెస్ ఇంటి గుట్టు ఈనాడు విలేకర్లు బజారున ఈడ్చాగాలుగుతున్నారు)
- కాంగ్రెస్ భూస్థాపితం ఖాయం అని CPI, CPM లు ఉద్గాటించినట్లు నమ్మబూనడం(౩౦ ఎల్ల చరిత్ర గల ఈనాడు సంపాదికీయం ప్రచిరుస్తున్న కాలం లో ఏనాడైనా CPM gaani, CPI gaani వేరే చిన్న చితక పార్టీలను ఓడించగలిగారా? ఇప్పుడు వీరు కాంగ్రెస్ ని భూస్తాపితం చేస్తారన్న విషయాన్ని ఈనాడు వారు మనకి నమ్మబూనడం)
ఇలా చెప్పుకు పోతే అంతే ఉండదు. కాంగ్రెస్ భవనం పై అరాచకం సృష్టించి వారికి వారే నిప్పంటించుకున్న ప్రభుద్దులు హాస్పిటల్ లో మరణ సేయ్యమిదుంటే, వారు మరణించే వరకు వారికి ఏమయ్యిందో కూడా జనానికి తెలియజెప్పే భాద్యత ఎరగని ఈ ఈనాడు; Jr.NTR కదిలారు అని ఒకప్పుడు, కదుల్తారని ఇంకొకప్పుడు, ప్రచారం చేస్తారని ఒకప్పుడు, ప్రచారం చెయ్యలేని స్థితి అని మరొకప్పుడు - ఇలా వున్నది లేనట్టు లేనిదీ ఉన్నట్టు ప్రజలని అయోమయానికి గురి చెయ్యడం తప్ప వేరేధీ తెలియక ఈనాడు ముందుకు సాగుతుంది.
P.S: కాల చక్రం లో ఈరోజు ఆంధ్రుడికి 24 గంటలు సరిపోక తన పని తను చేసుకుని పోతున్నాడు గనుక ఇలాంటి పత్రికల టక్కు టమారి విద్యలు చెల్లుతున్నాయి గాని లేకుంటే ఎప్పుడో ఇవి భూస్తాపితం అయ్యి ఉండేవనిచరిత్ర చెప్పకనే చెబుతున్నాయి.
Monday, April 6, 2009
'ఈనాడు' పరకాయ ప్రవేశ విద్య కడు వైభవంగా కొనసాగుతుందా?
Labels:
a,
andhra pradesh.,
b,
c,
chandra babu naidu,
congress,
cpi,
cpm,
d,
EENADU,
prajarajyam,
tdp,
user
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment