Wednesday, April 8, 2009

మనం ఎన్నుకున్న రాజకీయ నాయకీనాయకులకు ఈ ఎన్నికల్లో ఎన్నికళలో, ఎన్నికలలో?

సోనియా గాంధీ:
కళ: కట్టు బొట్టులతో హిందుత్వం ఆపాదించుకుని భారతీయులతో మమేకమని + హిందీ రాకున్నా, రాసుకున్న ప్రసంగాన్ని కాస్త అనర్గళంగా మాట్లాడగలను అని ప్రజలను భ్రమింప చేసే కళ గల నేర్పరి
కల: ఎలెక్షన్ టైం లోనే ప్రజలు రాజకీయ నాయుకుల మాటలు వినే దద్దమ్మ జనాలు ఉంటారని మహా నమ్మకం, దీనికి తార్కాణం - కేంద్రలో కాంగ్రెస్ కి ముఖ్యాంసం తెలంగాణమే అని నమ్మబలకడం. నమ్మబలికితే, ప్రజలంతా నమ్మేస్తున్నారని కల కనటం.

మాయావతి:
కళ: వైట్ కలర్ గూండా(స్త్రీలింగం లో ఏమంటారో నాకు తెలియదు గనుక ప్రస్తుతానికి గుండతో సరిపెట్టుకుందాం), రాజకీయ నాయకీ మొనార్కిజం. చందాలు విషయంలో ముక్కు పిండి మరీ వసూలు చేయగల కళ గల నేర్పరి
కల: దళిత గీతం పాడితే పిచ్చి ప్రజలు, అందులోనూ దేశం లో నలు దిక్కులలో ఉన్న జనులు తనని ప్రధాన మంత్రి పీటమేక్కిస్తారని పగటి కలలు గనటం.

జీవిత రాజశేఖర్:
కళ:
ఒద్దు మొర్రో అన్నా వినకుండా పిలవని పేరంటానికి వెళ్లి మరీ ప్రచారం పొందే ఆడపడుచు. ప్రతి చిన్న వ్యాపారానికి రిబ్బన్ కత్తిరింపుకి వెళ్ళేటప్పుడు మీడియాని వెంటబెట్టుకుని మరి వెళ్లి, అదికూడా ప్రజాసేవే అని మురుసిపోయే కళ గల ఆడపడుచు.
కల: ఈ మధ్య బడ్డీ కొట్టు ప్రారంబోత్సవంకి కుడా పిలవటం లేదని కలత చెంది, ఏంచెయ్యాలో తోచక చిరంజీవి పై కారాలు మిరియాలు నూరుతుంటే మీడియాలో కావలసినంత ఉచ్చిత ఊరేగింపు చూసి పొరబాటున తనని కూడా ప్రజలు ఓ MP గానో MLA గానో చూడాలని పట్టుపట్టి పిలుస్తారని కలలు గంటున్న కలహభోజి

రోజా:
కళ: సకలకళా వల్లభి. దేన్నైనా మసి పూసి మారేడు కాయ చేసే కళ గల నేర్పరి.
కల: తనపై ఉన్న బురదను ప్రజలు చుసేలోపు వేరొకరిపై జల్లితే పోలా, తనకి నచ్చని వారు పై బురద జల్లుతూ కలలు గానే తెగించిన తెలుగు జాణ.

రాజశేఖర రెడ్డి:
కళ: తన వెకిలి నవ్వుతోనే శత్రుసన్నిహుతులని సమర్ధంగా నేగ్గుకోచ్చే కళానైపుణ్యము గల ముఖ్యమంత్రి
కల: కాలినడకతో ప్రజల గుండెలు కొల్లగొట్టి ముఖ్యమంత్రి కాలేడు అని కలలు గన్న విశ్లేశుకులను మునుపటి ఎన్నికల్లో ఎలా బోల్తా కొట్టించాడో ఈ సారి కూడా తన మనోధైర్యంతో ముఖ్య మంత్రి పదవిని అలంకరిచగాలను అని కలలు కంటున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి

చంద్ర బాబు నాయుడు:
కళ: రాజకీయంగా బతక నేర్చి, ఏ ఎండకాగొడుగు పట్టగల సకల కళా వల్లభుడు. తను గన్న కలలు కోసం తన నియమ నిబంధ నమ్మకాలను కుడా తుంగలో తొక్కి తైతక్కలాడే కళా ప్రపూర్నుడు.
కల: ఉచితంగా విద్యుత్తు ఇస్తాను అంటే అందులో సాధ్యా అసాధ్యాలు తెలియని ఈ దద్దమ్మ ప్రజలు రాజశేఖర రెడ్డిని ఎలా గద్దె నేక్కిన్చారో, ఉచితంగా కలర్ టీవీ ఊరబ్బసోమ్ము మార్పిడి అంటే తనని కుడా ఈ ప్రజానికానికం గద్దె నేక్కిస్తాదని డోకా లేని కలలు గంటున్న చంద్ర బాబు నాయుడు.

కే.సీ.ర్:
కళ: పిచ్చజనంకి ఎం కావాలో తెలుసో లేదో తెలియదు గాని, రాజకీయనాయకీనాయకులనుంచి ఎం రాబట్టుకోవాలో, వాళ్ళని తన తెలంగాణా యాసలో ఎలా ఏక రేవుపెట్టాలో కిటుకులు తెలిసిన మహా కళాకారుడు మన కే.సీ.ర్
కల: ఈ గుంపు లో ఉంటె ఆ గుంపును బొందె పెడతాను అని మంగమ్మ సేపధం పట్టడం, ఆ గుంపు లో ఉంటె ఈ గుంపును బొందె పెడతాను అని నీళ్ళు నవలడం తప్ప కలలు కనటం తెలియని కళావిహీనుడు.

కొస మెరుపు:
ఇంతకీ ఓటరు తన అమూల్యమైన ఓటేసే వరకు ఏ నా రాజకీయనయికుడిని బలపరుస్తాడో తెలుసుకునే కళానైపుణ్యం కొరవడడం ఒకింత హాస్యా స్పదంగానే ఉంటుంది సుమీ. పోనీ కనీసం ఓటరు ఎటువంటి కలలు కనాలని అను కుంటున్నాడో కుడా తెలియని ఎదవ దద్దమ్మ రాజకీయ నాకులు మన రాజకీయ నాయకులు.

0 comments:

Post a Comment