గాయాల నుండి కోలుకున్న మన భయ్యా జూనియర్ NTR నిన్న సాయంత్రం తన స్వగృహం నుంచి నేరుగా ప్రచారం అంటే నేను గంతులేసి మరి tv9 కి అత్తుక్కున్నా! ఏమి ఉచ్చారణ, మాట్లాడే విధానం లో ఏమి స్పష్టత, ప్రాస పొల్లు పోకుండా మాట్లాడే మన తెలుగోడి ప్రచారాన్ని చూసే సరికి అసలు సంగతి అప్పుడు అర్ధమయ్యింది - అది ప్రచారం కాదు, పక్కోలని హేళన ఎగతాళిల మాటల దండకమని. అయన మాటలు బట్టి నాకర్ధమయ్యింది ఏమంటే నందమూరి వంశానికే చిందింది ఈ ఆంధ్ర రాష్ట్రం అని, ఆంద్ర ప్రజానికమంత వాళ్ళ అడుగుల మడుగులేతాలనేది అయిన అభిమతంగా కనిపిస్తుంది. ఒక ఓటరుగా, ఒక బ్లాగర్ గా, ఒక ఆంధ్రుడుగా నా ఆవేదనని ఇక్కడ పొందు పరుస్తున్నా! భయ్యా అంటే పిచ్చ అభిమానమున్న పాఠకులకి ఒకింత ఇది మింగుడుపడదని నాకు తెలుసు ఐనా 27 ఎల్లున్న నవ యవ్వనపు పార్టీ నట్టేట్లో మునిగిపోతుంటే తన ఉడతా బత్తిగా తన ఒంతు సహాయం అందిస్తున్న భయ్యాని చూసాక స్పూర్తి పొంది ఒక ఆంధ్రుడునై, నిజమెరిగిన ఒక తెలుగు పౌరుడునై ఈ తెలుగు గెడ్డ పై పుట్టి 35 ఏళ్లగా ఆంధ్ర రాష్ట్రములో పెరిగిన నేను మన తెలుగు ప్రజానికి నా ఒంతుగా వివరించే ప్రయత్నమిది.
భయ్యా మాటల్లో: ఏ దేశమేగినా... ఎందు కాలిడినా... ఏ పీఠమెక్కినా.. ఎవరేదురైనా.. నిలపరా నీ జాతి నిండు గౌరవం...
భయ్యా! నువ్వు ఒక సారి ఆంద్ర రాష్ట్రం లో అందులోనూ అక్షరాశ్యత తక్కువన్న రాష్ట్రం లో ఉన్నావనేది మరవకు భయ్యా! సాధారణ మైన తెలుగు జనాలకి అర్ధమయ్యే భాషలో చెప్పు భయ్యా! ఈ స్టంటులన్ని సినిమాలో చెల్లుతాయి భయ్యా! సామాన్య ప్రజానీకంలో చొచ్చుకుని పోవాలంటే సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడు భయ్యా!
భయ్యా మాటల్లో: టీవీ లు లేని వారు భాద పడకండి తెలుగుదేశం అధికారంలోకి రానున్నది, చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మీ అందరికి కలర్ టీవీ లు ఇస్తారు
భయ్యా! టీవీలు లేని వారికి తెలుగు దేశం అధికారంలోకి రానున్నదని ఎలా తెలుస్తుంది? చంద్ర బాబు ముఖ్యమంత్రి అవ్వగానే వాళ్ళందరికీ కలర్ టీవీలు ఇస్తారని టీవీ లేని వారికి ఇలా తెలుస్తాది? భయ్యా! మరీ వెర్రి వెంగలప్పలావున్నావు నీ వాలకం చూస్తుంటే. కడుపు నిండుగా వున్నవాడు ఆకలి ఎరగడు అనేది జగత్ ఎరిగిన సత్యం. నువ్వు ఈ విషయం చెప్పవలసింది టీవీ లు లేక అల్లల్లాడుతున్న ప్రజానికానికి, అధివదిలేసి టీవీ లు చూస్తున్న వాళ్లకి చెబుతే వాళ్ళు నీ బంతులుగా పోయి ఇంటింటికి చెబుతారని ఏ ఆధారంతో నువ్వు ఈ మాటలు అంటున్నావు భయ్యా! అసలు నువ్వుంటున్న హైదరాబాద్ లో పేదల గుడెసలకు ఎన్నడన్నా వెళ్ళవా? కనీసం ఈ ప్రచార ఆర్భాట సమయమ లో నన్నా వాళ్ళ వంక తొంగి చూసావా? అటు మొన్న టీవీ9 వాళ్ళు ఒక సర్వే చెయ్యగా, రాష్ట్ర నడి బొడ్డున ఉన్న పేదల కుటీరంకి వెళ్లి అరా తియ్యగా వాపోవడం వాళ్ళ వంతయ్యింది. మరెందుకు భయ్యా చెవిటి వాళ్ళ వద్ద శంఖం వూది సంబర పడిపోతావు?
భయ్యా మాటల్లో:ఎన్నికలనే యుధం మొదలయ్యింది. ఈ యుధం లో 123 ఏళ్ల వృదాప్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉడుకు నేత్తురతో ఉరకలేస్తున్న 27 ఏళ్ల నీతివంతమైన తెలుగుదేశం.. ఆ తెలుగుదేశాన్ని బాల పరుస్తున్న మహా కూటమి మధ్య నడుస్తుంది.
భయ్యా! ఓ ప్రక్క నీతివంతమైన తెలుగు దేశం అంటున్నావు, మరో ప్రక్క 123 ఏళ్ల వృదాప్యంలో ఉన్న కాంగ్రెస్ పై యుధం అంటున్నావు అదీ గాక వృదుడి పై మహా కూటమి పోరు సాగిస్తుంది అని అంటున్నావు? ఇదేక్కడ నీతీ భయ్యా! ఏ నీతీ శాస్త్రం లో చూసిన యుద్దానికి కొన్ని నీతి నియమాలు కచ్చితంగా అందరికి అర్ధమయ్యేతట్టుగా చెప్పారు భయ్యా అందులోనూ యుధం అనేది సమ ఉజ్జీల తోనే ఉండాలి అనేది మొదటి నీతి భయ్యా! కాని ఒకని పై యుద్దానికి ఒకడే వెళ్లాలే గాని కుక్కల పందుల గుప్పుల వలె దాడి చేస్తే అది యుధమని ఏ నీతీశాస్త్రం లో రాసారో కాస్త చెబితే ఇక నుంచైనా నీతి అనే పదానికి అసలైన అర్ధం మేమందరం తెలుసుకుంటాము భయ్యా! ఐన తెలుగుదేశం పార్టీ సారూప్యం కి తెలంగాణా రాష్ట్రీయ సమితి సారూప్యానికి పొంతన ఏది? తెలంగాణా వేర్బాటు వెతిరేకుదారులైన కమ్యూనిష్టుల మధ్య కూటమి ఏంటి భయ్యా! మీ మావంటే వయసు పై బడింది గనుక ఇలాంటి ఫిలోసఫీలు మర్చిపోయాడను కుందాం, నువ్వేంటి భయ్యా - నువ్వు యువ నేతవి, తెలుగు తెజానివి, నీలో ఉడుకు రక్తం వురకలేస్తున్నది అలాంటి నువ్వే ఇలాంటివి ప్రోత్సాహిస్తూ తిరిగి మమ్మల్ని మీకు ఓటేసి మళ్ళీ మరో ఐదేళ్ళపాటు అవనీతిని మా పై రుద్దడానికి నీకు మనసు ఎలా వచ్చింది భయ్యా!
భయ్యా మాటల్లో:పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాం! తప్పు చేసాం!! చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏం లాభం?
భయ్యా! ఇంతకి పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ ని గెలిపించిందా? అంటే మాకు తెలియకుండానే మీకు మీరే మేచ్చ్ ఫిక్సింగ్ లు చేసేసుకున్నారా? మరెందుకు భయ్యా ఈరోజు ఇన్ని ప్రయాసలు చేసి మొత్తం మీ వెనుకనే ఉన్న మీడియాని ఉపయోగించి మమ్మలిని దద్దమ్మలు చెయ్యటం.
ఏంటి భయ్యా! మేమే ఓటు వేసి కాంగ్రెస్ గెలిపించాము అంటావా? అయితే నువంటున్న 'గెలిపించాం' అనేది మాకు ప్రతినిధ్యంగా మా ప్రతినిధిగా చెబుతున్నావా? భయ్యా ఏనా వెధవ నిన్ను మాకు ప్రాతినిధ్యం వహించమని వేడుకున్నాడు అదీ మాందరికి తెలియకుండా? మేమేమన్నా నందమూరి వంశం వాళ్ళమా నువ్వు మాకు ప్రాతినిధ్యం వహించడానికి, లేక ఆంధ్ర రాష్ట్రం ఎమన్నా మీ తాత జాగీరా? లేక మీ బాబు సొత్తా, ఏ ఆధారంతో మమ్మలిని నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నవో చెప్పు భయ్యా!
భయ్యా మాటల్లో:తెలుగు దేశం అధికారంలోకి వచ్చినప్పుడు రైతు బజార్లు పెడితే... కాంగ్రెస్ వాళ్ళిప్పుడు మందు బజార్లు పెట్టారు
భయ్యా! నువ్వు ఏ తెలుగు దేశం గురించి మాట్లాడుతున్నావో నాకైతే అర్ధం కావటం లేదు, ఒక పక్క తాత గారి ఏకైక వారసున్ని సొంత డబ్బా కొట్టు కుంటావు, మరో ప్రక్క మీ మావా చేసిన పనులతోనే మిగతా వాళ్ళని పోలుస్తున్నావు? ఇంతకి నీకు తెలుగు దేశం అంటేనే స్పష్టత లేదేమో భయ్యా! సర్గీయ మీ తాత గారు స్వయానా మందుని క్రమబదీకరించి వరుణ వాహిని అని నామకరణం పెట్టి ప్రభుత్వాలే ప్రజలనుండి మందు పై శిస్తు వసూలు చెయ్యొచ్చు అని నీతి మాలిన పని చేసి పెట్టడం వాళ్ళ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం లో అధికారానికి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ దాని ప్రోత్సాహిస్తుందంటే అదీ మీ తాత చలువే భయ్యా! తాత గారి గురించి అంత తెలిసిన వాడివి ఇవి తెలియవా భయ్యా? అంటే మీరే ప్రజలకి వాత పెట్టి మీరే వెన్న పూసి పై పెచ్చు పక్క వాళ్ళని ఆడి పోసుకుంటావు ఎం భయ్యా!
భయ్యా మాటల్లో:అన్న ఎన్టీఅర్, చంద్ర బాబులు నీతి మంతంగా, ప్రభుత్వ యంత్రాంగాన్నినీతీమంతంగా నడిపించారు!
బేష్ బయ్య! నీ అవగాహన రాహిత్యానికి శత కోటి దండాలు. భయ్యా! అన్న ఎన్టీఅర్, చంద్ర బాబులు నియంతలుగా ఈ రాష్ట్రాన్ని పాలించారు భయ్యా! చరిత్ర ని తిరగేస్తే తెలిసేది ఏంటి అంటే అన్న ఎన్టీఅర్ నియంతగా ఉండటం చంద్రబాబు కి అప్పట్లో నచ్చకే మీ తాతని నమ్మి అయన చెప్పిన తొత్తు గాళ్ళని మేమేన్నుకున్న వాళ్ళని కొనేసి రాత్రికి రాత్రి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికీ ముఖ్య మంత్రి అయ్యాడు. ఒకప్పుడు ఫ్రీ లకి వ్యతిరేకమైన ఈ చంద్ర బాబు నాయుడు, ఫ్రీలు మొర్రో అని ప్రజలు వెంట పడుతున్నాడు. లో చంద్రబాబు కి ఇప్పుడు నువ్వు చెబుతున్నవే ఆ చంద్రబాబుకి చెట్టుకి చాన్తాడుకి ఉన్నంత తేడ ఉంది భయ్యా!. పరమ పదించిన వారు దేవుడుతో కోలిసే భూమి గనుక మీ తాత గారిని పక్కన పెడితే, ఓ ఓ నీతుమంతుడు అని తెగ డప్పు కొడుతున్న ఈ చంద్ర బాబు ఏ విధంగా నీకు నీతి వంతుడుగా కనిపిస్తున్నాడో కాస్తో కూస్తో బుదన్నఈ ప్రజానీకం అంతు చిక్కడం లేదు భయ్యా!
భయ్యా మాటల్లో:అర్ధ రాత్రి మహిళలు ఒంటరిగా తిరిగిన రోజే మన దేశానికి నిజమైన స్వతంత్రయమన్నారు గాంధీజీ
తూచ్ తూచ్.... మల్లి ఒక సారి చెప్పు భయ్యా! చూసావా తెలుగు దేశం వాళ్ళు ఎంత స్వార్ధ పరులో. మీరు గాంధీజీ ని వాడుకోవోచ్చా, తొక్కలోది వేరే పార్టీ వాళ్ళు వాడితే మీకు అది కిట్టదా, వాళ్ళంతా మహా మహులతో వ్యాపారం చేసుకుంటారా, మరి నువ్వేం చేస్తున్నావు భయ్యా మరి మీ పార్టీ ఎం చేస్తుంది భయ్యా! ఒకప్పుడు నటుడు నగార్జున్ కి మీ జన్మ భూమి కార్యక్రమం నచ్చి ఆ కార్యక్రమంలో పాలు గున్నపుడు మీకు అయిన మంచి వ్యక్తా? ఇవ్వాళా ఆయనికి నచ్చి కాంగ్రెస్ కి తానే స్వయంగా వెళ్లి ప్రచారం చేస్తుంటే ఆయనికి కాంగ్రెస్ తొత్తు అని బిరుదిస్తారా?
భయ్యా మాటల్లో:కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ వస్తే ఆంధ్ర రాస్త్రానికంటూ ఏమి మిగల్చుకుండా మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారంట.
భయ్యా ప్రతీ రోడ్ షోలో తెలుగు దేశం 27 ఏళ్ల వయసున్న నవ యవ్వనపు పార్టీ అని తెగ విర్ర వీగుతున్నావుగా మరి అట్లాంటి పార్టీకి ఎన్నికలకు 200 రోజులు ఉండగానే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దోచేస్తుందని గుర్తుకొచ్చిందా? లేక కాంగ్రెస్ వాళ్ళు దోచుకునే విధానం చూసి మీ పార్టీ వారు కుళ్ళు కుంటున్నారా? నువ్వు కుడా ఈ ఆంధ్ర రాష్ట్రం లో ఒక సగటు పౌరుడవి మర్చిపోకు, ఇన్నాలు కాంగ్రెస్ ఆంద్ర రాష్ట్రాన్ని దోచేస్తుంటే నువ్వు ఎం చేస్తున్నావు అని నేను నిన్ను అడుగుతున్న? అంటే నీ మావకి నీకు 1600 రోజుల్లో కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రాన్ని కొల్లగోట్టేస్తుందని తేలిసి కూడా ఎందుకు మమ్మలిని చైతన్యం చెయ్యలేదు అని అడుగుతున్న? అంటే మీకు అందలం ఎక్కే సమయానికి మీ ముసలి కన్నీలు చూసి మీకు ఓటు గుదేస్తామని ఎలా అనుకుంటున్నావు భయ్యా!
భయ్యా మాటల్లో:అన్న ఎన్టీఅర్, చంద్ర బాబులు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎంతో కృషిచేసారు
భయ్యా! నువ్వు చరిత్రని సరిగా అఖలింపు చేసుకున్నట్టు లేదు, లేదా నీకు ప్రసంగ పాటవాలు సమకూర్చిన వారికి సరిగా చరిత్ర తెలిసి ఉండదనేది ఇప్పుడు మాబోటి ప్రజానికానికి చాల సులువుగా అర్ధమవ్వుతుంది. గురజాడ అప్పారావు,టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు వీరంతా ఎవరు భయ్యా?. టీవీలో ఫ్రీ షో కదా అని నీ ప్రసంగ పాటవం రాసే వాడికి బుధి లేక పోతే నీకేమయ్యింది భయ్యా! నువ్వు అనుకుంటునట్టు మాకు గురజాడ అప్పారావు,టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు ఇత్యాది వారు మాకు ఆపాదించి పెట్టిన ఆత్మ గౌరవం చెక్కు చెదరకుండా భాద్యత ఉన్నా లేకున్నా ఆంధ్రులు అందరం కలసి కట్టుగా కాపాడుకుంటూనే ఉన్నాం. మరి నువ్వు అదేదో నందమూరి వంశం వాళ్ళు కృషి అంటావు, అంటే నువ్వు కూడా నందమూరి కూపస్థ మడూకానివే అన్న మాట. భయ్యా! 1983 ప్రజానీకం 2009 ప్రజనికంకి చాలా తేడా ఉంది భయ్యా! ఈ ఎన్నికలు అయ్యాక నీకు కాలి ఉంటె, ఉంటాదిలే వుండక చస్తాదా? బేరీజు వేసుకుంటే నీకు నువ్వే నిజాని నిగ్గు తెలుచుకోవోచ్చు భయ్యా!
భయ్యా మాటల్లో: ఇంకో వైపు ఇటీవలే వచ్చిన పార్టీ - 'ఇప్పటి దాక రెండు పార్టీలకు అవకాశమిచ్చారు.. తనకో అవకాసం ఇవ్వాలి' అని కోరుత్తున్నారు. ఇదేమైనా సినిమానా? అవకాసం ఇవ్వడానికి అని ప్రశ్నించారు? ఇదేమన్నా పెరంతమా బొట్టు పెట్టి పిలవడానికి?
భయ్యా! నీ క్రింద ఉన్న నలుపుని నలుగురికి పూసేస్తే జనాలందరు ఆ నలుగురినే నోరెళ్ళ బెట్టి చూస్తారని గొప్ప ప్లాన్ పన్నావు భయ్యా! భయ్యా ఒక సారి నీ డ్రెస్ చూసుకో భయ్యా, ఎప్పుడన్నా నీ జీవితం లో ఏ గడియలోనైన ఖాకి బట్టలు వేసుకున్నావా? కేవలం సినిమాల్లో నట్టించేటప్పుడు తప్పించి ఎప్పుడు వేసుకుని ఉండవు. అంటే ప్రజలు నీ ఆహార్యముని, కట్టు బట్టలని చూసి వాళ్ళ వాడు, శ్రామికుడు అని నమ్మిదామని నువ్వేం వేషం వేసావో? దీనేమంటారో చెప్పు భయ్యా? భయ్యా నువ్వు చేస్తున్నది ఎన్నికల ప్రచారం! సినిమా షో కాదు భయ్యా. ఏదో మీ తాత మా తల్లి తండ్రులను ఈ ఖాకి బట్టలు వేసుకుని నమ్మించి బుట్టలో వెసుకునందుకు అది వాళ్ళ ధౌర్భాగ్యమ్, తిరిగి ఏం ముఖం పెట్టుకుని ఆ ఖాకి దుస్తులు వేసుకుని మమ్మలిని నమ్మించడానికి వచ్చావు భయ్యా! అయినా భయ్యా తెలుగుదేశం 27 ఎల్ల యువ రక్తం ప్రవహిస్తున్న నవ యవ్వనపు పార్టీ కదా మరి నిన్న మొన్న మొలిచిన పార్టీ ని చూసి నీ(మీ)కెందుకంత భయం భయ్యా!
భయ్యా! పెప్సి కంపెనీ, కోకో కోలా కంపెనీ, మిగతా అంతర్జాతీయ కంపెనీలన్నీ పనికి రాణి కంపెనీలు అంటావా? అయితే మరి నువ్వు నీ నందమూరి వంశం వాళ్ళందరు వెళ్లి వాళ్ళ వానిధ్య ప్రకటనల్లో నట్టించోచ్చుగా, హి హి హి అంటే వాళ్ళు పిలవందే నువ్వెల్ల లేవన్నటే గా దీనర్ధం. అంతే భయ్యా నువ్వు, నీ స్థానం ఈ సంఘంలో ఉన్న ఆంధ్రులందరికీ తెలుసు భయ్యా!.
అయినా ఎం చూసుకుని మీ నందమూరి వంశీకులకు(పురందీస్వరిని మినహాయిస్తే) ఇంత తల బిరుసు, అహంభావం, పక్ష పాతం భయ్యా! అసలు నువ్వెవడివి భయ్యా! ఆఫ్టర్ అల్ మీ తాత అప్పటి కాలం లో మంచి నటుడు గనక ఆంధ్ర ప్రజానీకం నీరాజనాలు పట్టారు గనుక మీ తాతని మా తలలు తండ్రులు ఓటేసి గెలిపించారు భయ్యా, ఆ సమయమ లో నువ్వు గాని నీ మావ గాని ఉండి ఉంటె వాళ్ళు అసలు ఎన్నుకునే వారే కాదు భయ్యా! నువ్వు గాని, నీ మావ గాని, నీ భాబాయి గాని, మొతానికి నీ వంశంలో అందరు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తల బిరుసుగాల్లు భయ్యా. భయ్యా, మీ తాతే లేకుంటే ఈ రోజు నువ్వు ఇదే చంద్ర బాబు నయిడుని చూసి సగటు ఆంధ్రుడిలాగే యావగించుకునే స్థితిలో ఉండేవాడివి. నిజంగా నీలాంటోడు మా తరానికి గాని, భావి తరాని వాళ్లకి గాని ఎటువంటి మార్పూ తేలేరు భయ్యా. తుమ్మినా, దగ్గినా, ఏడిచినా, నవ్వినా మీ తాత పేరు జపించే మీరు మా ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడుతారా? అసలు ఇప్పుడున్న నందమూరి వంశంలో ఏ ఒక్కరికైన సొంత వ్యక్తిత్వం ఉందా? మీ బాబయేమో తోడబుట్టిన అక్కని మా కళ్ళ ముందే వ్యంగ్యంగా మాట్లాడి అవమానిస్తాడా? నువ్వేమో నీ రంగంలో ఉన్న నిష్ణాతులంటే నీకు నచ్చదాయేనా?, వారి పట్ల గౌరవ భావం ఉండదాయేనా?. భయ్యా, నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు జెమిని టీవీ లో ప్రత్యక్ష కారిక్రమంలో యాంకర్ నిన్ను చిరంజీవిగారి పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు నువ్వు ఆయనేవ్వరు అని జవాబిచ్చిన రోజే బుద్ధున్న ఈ ఆంధ్ర ప్రజానీకం నువ్వెంత అహంకారివో ఇట్టే పసిగట్టగాలిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ప్రజల్లో అహంకారానికి మచ్చుతునకగా చెప్పుకునే వ్యక్తిగా మిగిలావు. మీ తాతే లేకుంటే నువ్వు ఒక దూది పింజేతో సమానము భయ్యా! ఇక్కడ ఆంధ్ర ప్రజానీకం గుడ్డి వాళ్ళు కాదు భయ్యా! కళ్ళు మూసుకుని యెవరికి ఓటు వెయ్యాలో అలోచ్చిస్తున్నారు, అది చూసి నువ్వు నీ మంది మార్బలం, ప్రజలంతా గుడ్డి వారని నువ్వు గుడ్డిగా నమ్మి మాకు నేమలీకని ఇవ్వాలని చూస్తున్నావా? భయ్యా ఇది 20 వ శతాబ్దం కాదు భయ్యా! ఇది 21 వ శతాబ్దం భయ్యా! నువ్వు చెప్పే బూటకపు ప్రాస మాటలు విని ఆంధ్రులంతా తన్మయత్వం చెంది నీకు ఒటేస్తాము అని అనుకోవడానికి మేమేం ఈనాడు సంస్థ సభ్యులము కాదు, నందమూరి వంశం గాళ్ళం అంతకన్నాకాదు, నీవెంట తిరిగే వెర్రి నాగంమలం అస్సలు కానే కాదు, ఆఖరకు నీ మోచేతు నీళ్ళు తాగుతున్న వాళ్ళమైనా కాదు. ఇదే ఆంధ్ర ప్రజానీకం ఒక నాడు మార్పు ని కోరుకున్నారు గనుక మీ తాతని అందలం ఎక్కించిన పాపం మా తలలు తండ్రులు ఓడుగట్టు కున్నారు, ఇప్పుడూ మేము కుడా మార్పుని కోరుకుంటున్నాం అయితే మా తల్లితండ్రుల లా స్వామి భక్తికో, వ్యక్తి పూజకో లొంగే వాళ్ళం కాదు. ఎప్పుడో మార్పుకి నంది పలికాం అది కార్య రూపంలో ఉంది కుడా! మాకు ఎవ్వరిని ఎన్నుకోవాలో ఎవరిని ఎన్నుకోకూడదో నీకంటే మాకు ఎక్కువగా తెలుసు భయ్యా! నువ్వు మాగురించేమి బెంగ పెట్టుకోకు. సరేనా!
చివరి మాట: నువ్వొక తాటాకు లాంటివాడివి భయ్యా! చప్పుళ్ళు చెయ్యగలవు తప్ప మార్పు తేలేవు. ఉండుండు అన్నటు మర్చిపోయా, నువ్వు కుడా భవిష్యత్తులో మా రాభోయే తరం వారి ఖర్మ కాలి నువ్వే ముఖ్య మంత్రి అవ్వలనుకున్నావనుకో, ముందర నీ అహంభావాన్ని పూర్తిగా హతమార్చుకో భయ్యా! రెండోది ఇక నుంచైనా నీ సినిమా పూర్తి నిడివిలో ఒక్కసారి కూడా నీ నందమూరి వంశం పేరెత్తకుండా, తాత పేరు కనీసం ప్రస్తావించకుండా తియ్యి భయ్యా! అది చాలు. బస్తి మే సవాల్ నువ్వు చెయ్యలేవు భయ్యా!!
Tuesday, April 14, 2009
Subscribe to:
Post Comments (Atom)

veedu election tharuvatha telugu jathini galikai vadilesthadu . . ippudu veedoka vikalangudu . . . matale kani chethalu levu . . veedu pilli kadu eluka kadu. . alagani simham anlante . . . daaniki mundu veedu manishe kadu ani manam telusukovali . . ..
ReplyDelete